26.7 C
Hyderabad
May 3, 2024 10: 08 AM
Slider ప్రత్యేకం

క్రైస్తవ మతాన్ని ప్రభుత్వ నిధులతో ప్రోత్సహిస్తున్న జగన్

#BJP AP

ఆంధ్రప్రదేశ్ లోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నేరుగా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తున్నదని భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతున్నాయని, దీనికి అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటున్నదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఫేస్ బుక్ మాధ్యమంలో ఇన్ నేషనల్ ఇంటరెస్టు శీర్షికతో షెహజాద్ పూనావాలా అనే యాంకర్ నిర్వహించిన చర్చా వేదికలో బిజెపి జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ ధియోదర్, రాజ్యసభ సభ్యుడు జీ వి ఎల్ నరసింహారావు, బిజెపి ఏపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

ఏపిలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మత మార్పిడులను నేరుగా ప్రోత్సహిస్తున్నారని సునీల్ ధియోదర్ అన్నారు.

పోలీస్ స్టేషన్ లలో క్రిస్మస్ జరుపుకున్న సంఘటనను విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తావించగా, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తొలి ఏకాదశి రోజున (డిసెంబర్ 25న) తిరుమల తిరుపతి లో స్వామి వారి దర్శనం తర్వాత హాపీ క్రిస్మస్ అని చెప్పారని సునీల్ ధియోదర్ గుర్తు చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వమే టెండర్లు పిలిచి మరీ చర్చిలను నిర్మిస్తున్నదని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. టెండర్లను ప్రభుత్వం పిలవడం తో బాటు చాలా చర్చిలు అసలు అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారని విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు.

రెవెన్యూ అధికారుల నుంచి గానీ మునిసిపల్ అధికారుల నుంచి గానీ అనుమతులు తీసుకోకుండానే చర్చిలు నిర్మిస్తున్నారని, వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతుగా నిలబడుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

గతంలో వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా చర్చి పాస్టర్లకు పెద్ద ఎత్తున సాయం చేశారని, ఇప్పుడు అంతకన్నా మరింత ఎక్కువగా జరుగుతున్నదని వారు తెలిపారు. రాజశేఖరరెడ్డి హయాంలో పరోక్షంగా చర్చిలకు సాయం చేశారని, అయితే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హయంలో నేరుగా ప్రభుత్వ నిధులను చర్చిలకు వాడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

అంతర్వేది లో రథం తగుల బెట్టిన వారిని, రామతీర్ధంలో రాముడి తల నరికిన వారిని ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం పట్టుకోలేదని సునీల్ ధియోదర్ అన్నారు. ఈ కేసుల్లో సీబిఐ దర్యాప్తు చేయాలా? అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిందితులను పట్టుకోలేకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీబిఐ పైకి బాధ్యత నెట్టడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ నిధులతో రామ మందిరం నిర్మించడం లేదని, తలచుకుంటే ఆ పని చేయవచ్చునని ఆయన తెలిపారు.

మత మార్పిడుల మాఫియా ఏపిలో ఎంతో చురుకుగా పని చేస్తున్నదని ఆయన తెలిపారు. దేశంలో కొన్ని చోట్ల చర్చిలు దేశద్రోహ చర్యలకు నిలయాలుగా మారాయని ఆయన ఆరోపించారు.

మమతా బెనర్జీ, ఎం కె స్టాలిన్, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ తమ రాష్ట్రాలలో ముస్లింలను, క్రైస్తవులను నేరుగా ప్రోత్సహిస్తూ వారి కోసం ప్రత్యేకంగా కాలనీలు నిర్మిస్తున్నారని సునీల్ ధియోదర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ రెడ్డి ప్రభుత్వం మత మార్పిడులను తక్షణమే నిలుపుదల చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.   

Related posts

మున్సిపాలిటీలో 5 రూపాయల భోజన పథకం అమలు చేయాలి

Satyam NEWS

విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరం

Satyam NEWS

దేశంలో ఎస్సీ, ఎస్టీలపై పెరిగిన దాడులు

Sub Editor

Leave a Comment