36.2 C
Hyderabad
May 15, 2024 17: 15 PM
Slider విజయనగరం

“స్పందన”కు పెరిగిన ఫిర్యాదులు… పరిష్కారం చూపిస్తున్న డీఐజీ

#Vijayanagaram Police Spandana

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి రాజకుమారి, నిర్వహించారు. ఈ “స్పందన” కార్యక్రమంలో 35 ఫిర్యాదులును జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ స్వయంగా స్వీకరించారు.

స్పందనకు వచ్చిన బాధితులు తమ తమ.సమస్యలను ఫిర్యాదుల రూపంలో ఇవ్వడంతో జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడారు. ఫిర్యాదు అంశాలను తెలిపి, వాస్తవాలను తెలుసుకొని, తగిన సూచనలతో ఆదేశాలు జారీ చేసారు.

“స్పందన” లో వచ్చిన ముఖ్య మైన ఫిర్యాదు లు వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం మండలం, ముడిదాం కి చెందిన ఒకామె ఫిర్యాదు చేస్తూ తనకు తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి కి చెందిన ఎస్.శ్రీనివాస్ తో పదేళ్ల క్రితం పెళ్లి అయిందని,తనను, పిల్లలను సరిగా చూడకుండా, పట్టించుకోకుండా, మమ్మల్ని విడిచి పెట్టి తన సొంత ఊరు వెళ్ళిపోయారని, తన భర్తపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాల్సిందిగా ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును పరిశీలించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి, న్యాయం చేయాల్సిందిగా దిశా మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీని ఆదేశించారు. జామి మండలం, కలగాడకి చెందిన రాయవరపు అప్పలనాయుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన గ్రామంలో కొంత భూమి ఉందని, సదరు భూమిని రాయవరపు కృష్ణ మరి కొంతమంది కలిసి దౌర్జన్యం చేసి దురాక్రమణకు పాల్పడుతున్నారని, న్యాయం చేయాల్సిందిగా కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించి న జిల్లా ఎస్పీ చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్. కోట సీఐని ఆదేశించారు. గంట్యాడ మండలం, రామవరం గ్రామానికి చెందిన వి.జగన్నాదరావు జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తన ఇంటి స్థలం చుట్టూ ప్రహారి నిర్మాణం చేపడుతుండగా కె. మహేష్ అనే వ్యక్తి దౌర్జన్యం చేసి, గొడవ పడి,రాయితో దాడి చేసి గాయపరిచాడని, అతనిపై చర్య తీసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా గంట్యాడ ఎస్.ఐని ఆదేశించారు. భోగాపురం మండలం, నారు పేటకి చెందిన నారు అప్పలరాజు జిల్లా ఎస్పికా ఫిర్యాదు చేస్తూ విశాఖకు చెందిన నీలాపు అప్పలరామస్వామి వద్దనుండి కుమిలిలో 2.41 సెంట్లు జిరాయితీ భూమిని నీలాపు రవీంద్రరెడ్డి మద్యవర్తి ద్వారా కొనుగోలు చేయుటకు  5 లక్షల చెక్కు ఇచ్చినట్లు, తనకు భూమి రిజిష్టరు చేయకుండా సదరు ఇద్దరు వ్యక్తులు మోసం చేస్తున్నట్లు, తనకు భూమిని రిజష్టరు చేయించి, న్యాయం చేయాల్సిందిగా కోరారు.

ఈ ఫిర్యాదు పై న్పందించిన జిల్లా ఎస్పీ చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా భోగాపురం సీఐని ఆదేశించారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ స్వయంగా ఫోన్ లో మాట్లాడి, వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను వెంటనే తనకు నివేదించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.

ఎం. భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దు

Murali Krishna

చిల‌క‌ల గుట్ట‌ను సంద‌ర్శించిన మంత్రి అల్లోల‌

Satyam NEWS

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలి

Satyam NEWS

Leave a Comment