29.7 C
Hyderabad
April 29, 2024 08: 05 AM
Slider ప్రత్యేకం

ఈ పసిపిల్లలకు ఉన్న జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుందో……?

#MuluguSchool

ఈ సరస్వతీ నిలయంలోని విద్యార్ధులు చూపించిన చొరవ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తనదిగా చేసుకుంటే…… చేసుకుంటే ఇంకేముంటుంది?

ప్రపంచం మొత్తం సుభీక్షంగా ఉంటుంది. అంతరించి పోతున్న జలం ఇక సంవృద్ధిగా దొరుకుతుంది… ప్రపంచంలో తాగునీరు లేక అల్లాడుతున్న కోట్లాది మందికి నీటి కొరత తీరుతుంది. పంటలు సంవృద్ధిగా పండుతాయి…. కానీ చేసేవారెవరు?

ఈ సరస్వతీ నిలయంలోని ఉపాధ్యాయలు తీసుకున్న చొరవ మరెవరైనా తీసుకుంటున్నారా? అంతర్జాతీయ జల వనరుల దినోత్సవం సందర్భంగా ములుగు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బరిగలపల్లి లో విద్యార్థులు జల ప్రతిజ్ఞ చేశారు.

పాఠశాల లోని ప్రధానోపాధ్యాయులు కొత్త పల్లి పోషన్న విద్యార్ధులతో జల ప్రతిజ్ఞ చేయించి అందరికి ఆదర్శంగా నిలిచారు. నీటిని ఎలా పొదుపు చేయాలి, ఎలా సంరక్షణ చేయాలి, భూగర్భ జలాలు ఎలా పెంచుకోవాలో చెబుతూ ప్రతిజ్ఞ  చేయించారు.

అదేవిధంగా గ్రామ పంచాయతీ లో స్థానిక సర్పంచ్ గరిగ లత నర్సింగరావు, కార్యదర్శి దీకొండ అనిల్ కూడా ప్రతిజ్ఞ చేయించారు. ఇంకా అంగన్వాడీ టీచర్ ప్రమీల, పంచాయతీ సిబ్బంది శ్రీధర్, గ్రామస్థులు పాల్గొన్నారు.

కె మహేందర్, సత్యం న్యూస్

Related posts

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీపై అమరావతి రైతుల ఫిర్యాదు

Satyam NEWS

రాష్ట్రంలో వేడుకగా 680 పాఠశాలలు ప్రారంభం

Murali Krishna

ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకునేది లేదు

Satyam NEWS

Leave a Comment