28.7 C
Hyderabad
April 27, 2024 06: 19 AM
Slider ఆదిలాబాద్

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలి

#NirmalTown

హిందూ దేవతలను కించపరిచిన గురుకుల విద్యాలయాల రాష్ట్ర కార్యదర్శి ఐఏఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పై   కేసు నమోదు చేయమని నిర్మల్ జిల్లా బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు రాచకొండ సాగర్ ఈరోజు నిర్మల్ పట్టణ కేంద్రంలోని  టౌన్ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా రాచకొండ సాగర్  మాట్లాడుతూ  ధూళికట్ట ప్రాంతంలో  దీక్ష పేరిట చేస్తున్న కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా హాజరైన ఆయన  హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా  హిందూ దేవతలపై ఆరోపణలు చెయ్యడం  సరికాదన్నారు.

ఒక ఐపిఎస్ అధికారిగా,  భారత రాజ్యాంగం చేత   ఐపీఎస్  విధులకు నియమితమైన  వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా దళితులు, హిందువులు కాదనే విధంగా మాట్లాడడం ఒక అధికారికి తగదని ఆయన అన్నారు.

అందరిచే ఎడమచేతితో ప్రతిజ్ఞ చేయించడం,వారు Swero  పేరుతో రాష్ట్రాన్ని   విచ్ఛిన్నం చేస్తూ ,విద్యార్థులను ప్రక్క దోవ పట్టిస్తూ ఉండటం కరెక్టు కాదని అన్నారు.  తన సొంత ఆలోచనల్ని  విద్యార్థులకు నూరిపోస్తూ  అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆశయాలను దెబ్బతీస్తున్నారని అన్నారు.

ఆయన హిందూ సమాజానికి దళితులకు క్షమాపణ చెప్తూ ఆయనపై  IPC-295-A,298&153-A సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు .ఈ కార్యక్రమంలో  దళిత మోర్చా పట్టణాధ్యక్షులు హరిప్రసాద్  ,పట్టణ అధ్యక్షులు సాదామ అరవింద్  ,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిశాల అర్జున్  ,పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్  ,నరేష్  ,సాయన్న తదితరులు ఉన్నారు.

Related posts

అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అంతా సిద్ధం

Satyam NEWS

పురుగులు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

Bhavani

లక్ష్య సాధనతోనే విద్యార్థులకు సమాజంలో గౌరవం

Satyam NEWS

Leave a Comment