27.7 C
Hyderabad
May 4, 2024 07: 27 AM
Slider ప్రత్యేకం

క్రీడలతో పోలీసు ఉద్యోగుల్లో నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి

#vijayanagaramsports

వార్షిక  క్రీడల ప్రారంభ వేడుకల్లో విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక

విజయనగరం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండులో పోలీసు ఉద్యోగుల కోసం 30వ వార్షిక స్పోర్ట్స్ మరియు గేమ్స్మీ ట్ 2021ను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఘనంగా ప్రారంభించారు. ఈ మీట్ ప్రారంభోత్సవ వేడుకల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొని, మార్చ్ పాస్ట్ నిర్వహించారు.

నిత్యం విధి నిర్వహణలో నిమగ్నమై ఉండే పోలీసు ఉద్యోగులు, తమ ఒత్తిడిని తగ్గించుకొనేందుకు ఈ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ లో పాల్గొని, తమ క్రీడా ప్రతిభను కనబర్చారు. క్రీడల ప్రారంభ సూచకంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఎస్ఈబి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఓఎస్డీ ఎన్.సూర్యచంద్రరావులు గాలిలోకి బెలూన్లును ఎగుర వేసారు.

ఈ మీట్ లో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం సబ్ డివిజన్లు, ఆర్మ్డ్ రిజర్వు, హెూంగార్డు విభాగాల నుండి 150మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ క్రీడల ప్రారంభ వేడుకల సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ స్పోర్ట్స్ మరియు గేమ్స్ అనేవి ప్రతీ ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం అయినప్పటికీ పోలీసులకు మరింత ప్రత్యేకమైనదన్నారు.

సమర్ధ పోలీసింగ్ కు ఉపకరించే స్టోర్ట్స్

స్పోర్ట్స్ మరియు గేమ్స్ లో పాల్గొనడం వలన పోలీసుశాఖకు ఎంతో అవసరమైన క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఉద్యోగుల మధ్య సమన్వయం, టీం స్పిరిట్ వంటి లక్షణాలు పోలీసు ఉద్యోగుల్లో పెరుగుతాయన్నారు. సమర్ధవంతంగా పోలీసింగు అమలు చేయాలంటే ఒక వ్యక్తి లేదా ఒక అధికారి వలన సాధ్యం కాదని, పోలీసుశాఖలో పని చేస్తున్న ఉద్యోగులందరూ సమిష్టిగా, సమర్ధవంతంగా పని చేస్తేనే ప్రజలకు మంచిగా సేవలందించి, మంచి వ్యవస్థగా గుర్తింపు సాధించుకోగలమన్నారు.

ప్రతీ గేమ్ కు కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు, మెళుకవులు ఉంటాయని, వాటి వలన పోలీసుల్లో క్రమశిక్షణ పెంపొందుతుందన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనడం వలన ప్రతీ ఒక్కరిలోను శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.

ప్రస్తుత కాలంలో కోవిడ్ వైరస్ అనేక రకాలుగా రూపాంతరం చెంది ప్రతీ ఒక్కరిని భయపెట్టే పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ తమ శారీరక సామర్ధ్యాన్ని మెరుగుపర్చు కొనేందుకు కృషి చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఈ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ లో గెలుపొందండం కంటే పాల్గొనడం చాలా ముఖ్యమని గుర్తించాలని, ప్రతీ ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడాల్సిందిగా క్రీడాకారులకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక సూచించారు.

అనంతరం, క్రీడల ప్రారంభం, క్రీడా స్ఫూర్తికి చిహ్నంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక స్పోర్ట్స్ టార్చ్ ను వెలిగించి, జ్యోతి ప్రజ్వలనం చేసి, 100 మీటర్లు పరుగు పందెంను ప్రారంభించారు. మొదటి రోజు క్రీడా పోటీల్లో 100, 400 మీటర్లు పరుగు, పార్వతీపురం – బొబ్బిలి, ఆర్మ్డ్ రిజర్వు విజయనగరం సబ్ డివిజన్లు మధ్య వాలీబాల్, బొబ్బిలి ఆర్మ్డ్ రిజర్వు, పార్వతీపురం విజయనగరం సబ్ డివిజన్లు మధ్య బాస్కెట్ బాల్, మహిళలు, పురుషులకు షాట్ ఫుట్, డిస్క్ జావిలిన్ త్రో, కబడ్డీ, టెన్నిస్ పోటీలను పిఈటిల పర్యవేక్షణలో నిర్వహించారు.

ఈ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ లో ఎస్ఈబి అదనపు ఎస్పీ ఎన్.శ్రీ దేవీరావు, అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఒఎస్టీ ఎన్. సూర్యచంద్రరావు, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, ట్రాఫిక్ ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, సిఐలు ఎన్.శ్రీనివాస రావు, జి.రాంబాబు, జె.మురళి, రుద్రశేఖర్, విజయనాధ్, టివి తిరుపతిరావు, డి.రమేష్, సిహెచ్. శ్రీనివాసరావు, ఎం. శేషు, ఆర్ ఐలు పి. నాగేశ్వరరావు, చిరంజీవి, టివి ఆర్ కే కుమార్, పి. ఈశ్వరరావు, మరియరాజు, రమణమూర్తి, కమ్యూనికేషన్ ఇన్స్ పెక్టరు చిట్టి, ఎస్ఐలు, సిబ్బంది, పీఈటీలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు.

Related posts

తెలగ, బలిజ, కాపు సంఘాల జేఏసీ నేత దాసరి రాముకు పరామర్శ

Bhavani

యాదవులు, కుర్మల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

Satyam NEWS

మంత్రులపై కేసుల ఉపసంహరణకు హైకోర్టు నో

Satyam NEWS

Leave a Comment