31.2 C
Hyderabad
May 2, 2024 23: 34 PM
Slider విజయనగరం

సిఫార్సులకు తావులేకుండా పోలీసు శాఖలో బదిలీలు…..!

#transfer

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళుకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక కౌన్సిలింగు నిర్వహించి, వివిధ పోలీసు స్టేషనుల్లో ఏర్పడిన ఖాళీలను బదిలీలతో భర్తీ చేసారు. వివిధ పోలీసు స్టేషనుల్లో ఐదు ఏళ్ళు పూర్తి చేసుకున్న ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళను వారి వయస్సును ప్రాధాన్యత ఆధారంగా లిస్టును తయారు చేసి, వారిని కౌన్సిలింగుకు ఆహ్వానించారు.

లిస్టు ప్రకారం ఒక్కొక్క పోలీసు అధికారిని జిల్లా ఎస్పీ ఎం.దీపిక పిలిచి, వారితో స్వయంగా మాట్లాడి, వ్యక్తిగత సమస్యలు, పిల్లలు చదువు, స్పౌస్ కోటా, అనారోగ్య కారణాలకు ప్రాధాన్యత కల్పించి, వారు కోరుకున్న చోటుకు బదిలీ చేసారు. వివిధ పోలీసు స్టేషన్లులో ఏర్పడుతున్న ఖాళీలను స్క్రీన్ మీద చూపుతూ, కౌన్సిలింగ్ హాజరైన పోలీసు సిబ్బందికి ఖాళీల వివరాలను తెలుపుతూ, వారు కోరుకున్న పోలీసు స్టేషనుకు ఎటువంటి సిఫార్సులు లేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా బదిలీలు చేయడంతో పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

మొత్తం 8మంది ఎఎస్ఐలు, 16మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 76మంది పోలీసు కానిస్టేబుళ్ళును వివిధ పోలీసు స్టేషన్లుకు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఉత్తర్వులు జారీ చేసారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, పోలీసు కార్యాలయ ఎఓ వెంకట రమణ, ఎస్బీ సీఐ సీఐ నర్సింహమూర్తి, ఆఫీసు పర్యవేక్షకులు కామేశ్వరరావు, జూనియర్ సహాయకులు చాముండేశ్వరి మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పేద బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకున్న మానవతామూర్తులు

Satyam NEWS

పెద్ద శేష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

Bhavani

ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో వివేకానంద జయంతి

Satyam NEWS

Leave a Comment