33.7 C
Hyderabad
April 30, 2024 00: 45 AM
Slider ప్రత్యేకం

పేద బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకున్న మానవతామూర్తులు

#brahmins

నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబాన్ని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ రమణాచారితో బాటు పలువురు మానవతా మూర్తులు ఆదుకున్నారు. ఆధ్యాత్మిక, సనాతన ధర్మపరమైన అంశాలతో పాటు బ్రాహ్మణుల స్థితిగతులను దృశ్య రూపకంగా ప్రజలకు అందిస్తున్న ab6news ఒక పేద బ్రాహ్మణ కుటుంబం పడుతున్న బాధలను వెలికి తీసుకువచ్చింది.

హైదరాబాద్ నగరంలోని కర్మాన్ ఘాట్ ప్రాంతంలో ఉంటున్న బీచరాజు శ్రీనివాసరావు కు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరికి పెళ్లిళ్లు చేసిన శ్రీనివాసరావు ఓ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో బీచరాజు శ్రీనివాసరావును ఆటో ఢీ కొట్టింది.

ఆ ప్రమాదంలో ఎడమకాలు విరిగింది. అప్పులు చేసి కాలుకు రాడ్ వేయించుకున్నాడు కాని ఆర్థికంగా మరింత చితికిపోయాడు. మళ్లీ ఆపరేషన్ చేస్తేగాని కొద్దికాలానికి బయటకు వెళ్లలేడు…. ఆ కుటుంబానికి ఓ ముద్ద అందించలేడు. ఆయన భార్యకు గతంలో స్టౌ ప్రమాదంలో ముఖం కాలిపోయింది. దీంతో ఆమె బయటకు వెళ్లి పనిచేయలేని పరిస్థితి ఉంది. ఎవరూ పని ఇచ్చేవారు కాదు.

ఇక తనపై ఆధారపడ్డ వృద్ధ తల్లిదండ్రులు… ఇలా కష్టాలన్నీ శ్రీనివాసరావును చుట్టుముట్టాయి… విధి ఆడిన నాటకంలో శ్రీనివాసరావు కుటుంబం చివరకు గణేష్ ఉత్సవాల్లో ప్రసాదాలు తెచ్చుకుని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్సవాలు ముగిస్తే ఆకలి కేకలే…ఈ విషయాన్ని తెలుసుకున్న ab6news ఆ కుటుంబం కన్నీటి వ్యథను ..ఇది కథకాదు..A Real Story.. కథనం ప్రసారం చేసింది…

ఈ కథనానికి దేశ విదేశాల నుంచి స్పందించిన ఎందరో మానవతామూర్తులు కేవలం 48 గంటల్లోనే సాయం అందించారు…కొద్ది కొద్ది డబ్బు లక్షల్లోకి చేరింది…ఆ కుటుంబం పరిస్థితి కథనం చూసిన తెలంగాణా ప్రభుత్వం స్పందించింది..వెంటనే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ రమణాచారి వెంటనే పరిషత్ సభ్యులు జోషి గోపాల శర్మను పంపించారు.

ఆ కుటుంబాన్ని కలుసుకుని వివరాలు తెలుసుకుని తక్షణ సాయంగా 50 వేలు అందించడమేగాకుండా..వృద్ధుడికి నెలకు రెండున్నర వేల పెన్షన్ మంజూరు చేశారు..ఇక భార్యకు వికలాంగుల పెన్షన్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.. ఆ కుటుంబం ఉండేందుకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చిన పరిషత్ వెంటనే ఆ పనులు మొదలుపెట్టారు… ఇలా ఎందరో మానవతామూర్తుల స్పందన అనిర్వచనీయం..

అప్పటివరకు ప్రసాదాలతో బతుకుతున్న కుటుంబం నేడు సంతోషంతో ఉంది…ఇది బ్రాహ్మణుల కోసం ఆరంభించిన చానల్ ab6 news సాధించిన అక్షర విజయం. ఒక పేద బ్రాహ్మణ కుటుంబాన్ని మానవతావాదులు ఆదుకోవడానికి సాయం చేసిన ab6news చీఫ్ ఎడిటర్  విష్ణుదాస్ శ్రీకాంత్ కు సత్యం న్యూస్ అభినందనలు తెలుపుతున్నది. జర్నలిజంలో కొత్త ఒరవడి సృష్టిస్తూ కథనాలను వెలువరిస్తున్న ab6news చీఫ్ ఎడిటర్  విష్ణుదాస్ శ్రీకాంత్ మరెంతో మంది అన్నార్తులకు అండగా నిలబడాలని కూడా సత్యం న్యూస్ ఆకాంక్షిస్తున్నది.

Related posts

మావోయిస్టు పార్టీ పై మరో ఏడాది నిషేధం

Satyam NEWS

కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ మంత్రివర్గం

Satyam NEWS

వనపర్తిలో ఆర్యవైశ్య మహిళ హత్య కేసులో 5గురు అరెస్టు

Satyam NEWS

Leave a Comment