ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు అరెస్టు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ లోపలికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. రెండో రోజు హాట్ హాట్ గా కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలులో ఈ సంఘటన మరింత చర్చకు దారితీసింది. దాంతో ఏపీ అసెంబ్లీ సభ ఐదు నిమిషాలు వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. సభలో గందరగోళం సృష్టించి బయటికి వెళ్లాలన్న ఉద్దేశంతోనే గొడవ చేస్తున్నారని నినాదాలు చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. టిడిపి నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా హెచ్చరించారు.
previous post
next post