39.2 C
Hyderabad
May 3, 2024 13: 04 PM
Slider విజయనగరం

శిక్షణలో ప్రతిభ కనబర్చిన విజయనగరం పోలీసు డాగ్ హ్యాండ్లర్ జగదీష్

#policedog

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుశాఖ ఇంటిలిజెన్సు సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో మంగళగిరి సి.టి.సి. శిక్షణ కేంద్రంలో తొమ్మిది మాసాల శిక్షణలో విజయనగరం జిల్లాకు కేటాయించిన ట్రాకింగ్ డాగ్ “లవ్ లీ” స్పేర్ హ్యాండ్లర్ బి. జగదీష్ ఉత్తమ ప్రతిభ కనబర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హెూంశాఖ మంత్రి చేతుల మీదుగా బహుమతిని పొందారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన పోలీసు డాగ్స్ మరియు వాటి హ్యాండ్లర్లు మంగళగిరి సి.టి.సి. శిక్షణ కేంద్రంలో 9 మాసాల శిక్షణను ఇటీవల పూర్తి చేసుకొన్నారు. అనంతరం, జిల్లాకు కేటాయించిన ట్రాకింగ్ డాగ్ “లవ్ లీ”, డాగ్స్ హ్యాండ్లర్స్ శిక్షణ ముగించుకొని జిల్లా కేంద్రంకు చేరుకొని, జిల్లా ఎస్పీ ఎం. దీపికను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తొమ్మిది మాసాల శిక్షణ తీరును, “లవ్ లీ” ఆరోగ్యం, శిక్షణ నైపుణ్యంను అడిగి తెలుసుకున్నారు.

9మాసాల శిక్షణలో జిల్లాకు చెందిన డాగ్ హ్యాండ్లర్ బి. జగదీష్ “స్పేర్ హ్యాండ్లర్” విభాగంలో విశేష ప్రతిభ కనబర్చి, ట్రోఫీని రాష్ట్ర హెూంశాఖ మంత్రి  తానేటి వనిత   చేతుల మీదుగా ట్రోఫీ ని అందుకున్నారన్నారు. ప్రతిభ కనబర్చిన డాగ్ హ్యాండ్లర్స్ బి. జగదీష్, జె. కిషోర్ కుమార్ లను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, రివార్డును అందజేసారు.

డాగ్ ‘లవ్ లీ’ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, క్రమానుగుణం వైద్య పరీక్షలు నిర్వహించాలని డాక్ హ్యాండ్లర్ కు జిల్లా ఎస్పీ ఎం. దీపిక సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టరు ఎన్. గోపాల నాయుడు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కోరిన కోర్కెలు తీర్చే మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు 28 నుండి

Bhavani

నిర్మల్ పట్టణం నాలుగు రోజులు పూర్తి లాక్ డౌన్

Satyam NEWS

కార్తికేయ హీరోగా చావు కబురు చల్లగా

Satyam NEWS

Leave a Comment