37.2 C
Hyderabad
April 30, 2024 12: 53 PM
Slider రంగారెడ్డి

కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న బండారి లక్ష్మారెడ్డి

#bandarilaxmareddy

ఉప్పల్  అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి  ని ప్రకటించిన పార్టీ అధినేత సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో బి ఫామ్ అందజేశారు. కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న అనంతరం బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్ కి,  సహకరించిన పార్టీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల్   నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. అనంతరం ఉప్పల్ నియోజకవర్గానికి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు నాయకులు బండారి లక్ష్మారెడ్డికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జి రావుల శ్రీధర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

నీలాచలం కొండ వద్ద స్పృహ తప్పిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు

Satyam NEWS

కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీపై మాటల తూటాలు

Satyam NEWS

చలో అసెంబ్లీకి బయలుదేరిన ఓయూ జేఏసీ నేతల అరెస్టు

Satyam NEWS

Leave a Comment