26.7 C
Hyderabad
May 3, 2024 07: 54 AM
Slider విజయనగరం

కరోనా యమ డేంజర్..అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు

#VijayanagaramPolice

“ఈ సెకండ్ వేవ్ కరోనా… చాలా ప్రమాదకరం…ఎవ్వరూ బయటకు రాకండి..” మరో చోట.. “చంటి పిల్లలతో షికారేంటి..? అసలే కరోనా ఆ పై కర్ఫ్యూ బయటకు రాకూడదని అందులోనూ చిన్న పిల్లలతో రోడ్ మీదకు రావడం మరింత ప్రమాదకరమైన నేరం చేసిన వారవుతారు..మీకు తెలియదా అంటూ” హెచ్చరికలు..

ఇక మరో జంక్షన్ లో స్వయంగా తన శాఖ సిబ్బందికి  “కర్ఫ్యూ సమయంలో ప్రజలెవ్వరూ రోడ్లమీదకు రాకుండా సూచనలు..” ఈ విధంగా కర్ఫ్యూ సమయంలో పరిస్థితి ని సాయంకాలపు సమయంలో పరిస్థితి దగ్గరుండి ఆకస్మిక తనిఖీల ద్వారా పరిశీలించారు.. విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ.

జిల్లాలో కరోనా కేసులు నాలుగు అంకెలకు దిగువలో వస్తున్న వేళ…జిల్లా ప్రజలను మరింత అప్రమత్తం చేసేందుకు దాదాపు ఇరవై రోజుల తర్వాత జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ పరిస్థితి ని పరిశీలించారు. తొలుత కలెక్టరేట్ జంక్షన్ వద్ద పరిస్థితి పరిశీలించారు.

అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ, ఇతర సిబ్బంది చేస్తున్న విధులను పరిశీలించారు. ఎవరెవరికి మినహాయింపు లు ఇచ్చి పంపాలో తగు సూచనలిచ్చారు. అక్కడ నుంచీ డీఎస్పీ ఆఫీసు, గూడ్స్ షెడ్ మీదుగా సీఎంఆర్ జంక్షన్ వద్ద ఆగి అక్కడే విధులు నిర్వహిస్తున్న వన్ టౌన్ ఎస్ఐ దేవీకి కొన్ని సూచనలిచ్చారు.

ఆ సమయంలో ఓ వ్యక్తి చంటి పిల్లాడిని బండిపై షికారు కని తీసుకెళ్లడాన్ని గుర్తించిన ఎస్పీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక అక్కడ నుంచీ కన్యకాపరమేశ్వరి టెంపుల్ కు వచ్చారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్..ఎస్పీ రావడాన్ని గమనించి అక్కడే ఉన్న అడ్డంకిలను తొలిగించే యత్నం చేయబోతుండగా..వద్దని చెప్పిన ఎస్పీ అక్కడ నుంచీ కుడివైపు తిరిగి పెద్ద చెరువు రోడ్ మీదుగా బాలాజీ జంక్షన్ వద్దకు వచ్చారు.

ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్టీఎఫ్ సిబ్బంది ని చూసి..ఇక్కడ ఇంచార్జ్ ఎవ్వరూ అంటూ ప్రశ్నించారు. అంతలోనే దూరంగా ఉన్న వన్ టౌన్ ఎస్ఐ కిరణ్ పరుగు పరుగున రావడంతో… జంక్షన్ వద్ద కర్ఫ్యూ సమయంలో వేయాల్సిన హర్డిల్స్ గురించి ఎస్పీ తగు సూచనలిచ్చారు.

ఇలా జిల్లా కేంద్రం లో ఎస్పీ పర్యటించి అటు ప్రజలకు ఇటు శాఖ సిబ్బందికి తగు జాగ్రత్తలు, సూచనలు ఇచ్చారు. ఏదైనా కరోనా సమయంలో  ఎస్పీ ఆకస్మిక పర్యటనలు చేసి..నిస్తేజంలో ఉన్న శాఖకు జిల్లా అధికారిగా జీవం పోసారని చెబుతోంది… సత్యం న్యూస్.నెట్.

Related posts

కోవిడ్-19 ను ఎద‌ర్కోవ‌డంలో డీ విట‌మిన్ పాత్ర‌

Sub Editor

షర్మిల అరెస్టు పై భిన్నాభిప్రాయాలు

Satyam NEWS

20 తర్వాత కంటైన్ మెంట్ జోన్లలో మినహాయింపు ఉండదు

Satyam NEWS

Leave a Comment