30.7 C
Hyderabad
May 5, 2024 06: 40 AM
Slider విజయనగరం

ప్రార్ధించే పెదవుల కన్నా…సాయం చేసే చేతులు మిన్న..

#club

పైన మీరు చదివి న ఈ హెడ్డింగ్ ఏంటని ఆశ్చర్య పోకండి. చాలా మంది లో వస్తున్న సంపాదన..చేస్తున్న పని ద్వారా వచ్చిన సొమ్ము లో ఎంతో కొంత ఇతరులకు ఇవ్వాలని.. పెట్టాలని నిర్ణయించుకునే వారు కోకొల్లలు. ఆ రూపంలో చాలా సేవా సంస్థలు వెలిసాయి. పలు స్వచ్ఛంద సంస్థ ల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో నే విజయనగరం దాదాపు 30 ఏళ్ల క్రితం వెలసింది…విజయనగరం లో థెరిసా క్లబ్.

దాతల సహాకారం..స్థానిక ఎంఎల్ఏ తోడ్పాటు తో నగరంలో ఆర్.అండ్.బీ జంక్షన్ వద్ద ఉన్న థెరిసా క్లబ్… వద్దకు వెళ్లి… ఫలానా సమయంలో.. ఇంతమంది కి భోజనం అందించాలని చెబితే చాలు…థెరిసా క్లబ్ యజమాని కొరియన్…వెనువెంటనే సిద్ధమవుతారు. అలానే…విజయనగరం కు చెందిన పెనుమత్స ఇందుమతీ ,రాజుల దంపతులు… ముందు కు రావడంతో.. సాధారణ డబ్బులు తీసుకుని… దాదాపు 300 మంది కి భోజనాలు అందించారు.

తన క్లబ్ లో స్వయంగా వండించి…ప్యాకెట్లు కట్టి.. ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ లో..ఉన్న థెరిసా విగ్రహం వద్ద..మధ్యాహ్నం 1గంటకు…దాత అయిన డా.పెనుమత్స ఇందుమతి చేతులు మీదుగా దగ్గరుండి అన్నార్తులకు ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత అయిన ఇందుమతి…”సత్యం న్యూస్. నెట్”ప్రతినిధి తో మాట్లాడుతూ… అన్నం పరం బ్రహ్మ స్వరూపమని…ఒ చిన్న మెతుకు కూడా పారేయ్య కూడదనేదే మా ఉద్దేశ్యం అని అన్నారు.

ఇక తమకున్న తాము సంపాదించిన డబ్బులో కొంత సొమ్ము తో అన్నార్తులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు.ఈ పరిస్థితుల్లో..థెరిస్సా క్లబ్ ను నా స్నేహితురాలు గుర్తు చేయడంతో తక్షణమే క్లబ్ ను సంప్రదించడం.వెనువెంటనే డబ్బులు ఇవ్వడం… ఆ మర్నాడే సర్వజన హాస్పిటల్ లో భోజనాలు పంపిణీ చేసామని.. తద్వారా.. ఒక మంచి కార్యక్రమం పూర్తి చేసామని ఇందుమతి చెప్పారు. ఏదైనా.. ప్రస్తుతం ఉన్న ఈ ఆండ్రాయిడ్ యుగంలో పరులకు సేవ చేయాలన్న ధృక్పదం కన్న..అందుకు..పూనుకోవడం శుభపరిణామని..అంటోంది..”సత్యం న్యూస్. నెట్”.

ఎం. భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

ఇద్ద‌రు రైతులు క్షేమం.. మ‌రొక‌రు గ‌ల్లంతు

Sub Editor

కరప్షన్: కలెక్టరేట్ లో అవినీతి తిమింగలం

Satyam NEWS

లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి సహకరించండి

Satyam NEWS

Leave a Comment