30.7 C
Hyderabad
April 29, 2024 03: 07 AM
Slider వరంగల్

లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి సహకరించండి

#lokadalat

లోక్ అదాలత్ లో అత్యధిక కేసుల పరిష్కారానికి బార్ అసోసియేషన్ సభ్యులు సహకరించాలని ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ పి.వి.పి. లలిత శివజ్యోతి కోరారు. వచ్చే నెల 11న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ సభ్యులతో నేడు సమావేశం నిర్వహించారు. జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల సూచనల మేరకు ఫిబ్రవరి 11న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.

రాజీ పడేందుకు వీలున్న అన్ని కేసులను పరిష్కరించుకునేలా అందరూ సహాయపడాలని కోరారు. లోక్ అదాలత్ లో న్యాయ సలహాలు సూచనల కోసం న్యాయ సేవా అధికార సంస్థ సిద్ధంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి టి.మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డి. రామ్మోహన్ రెడ్డి, మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాలుగు చంద్రయ్య, కోశాధికారి  బానోత్ స్వామిదాస్,మేకల మహేందర్, బొల్లి సారంగపాణి, కన్నోజు సునీల్ కుమార్, చెలుమల్ల రాజేందర్, మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎఫెక్ట్: టీటీడీ అధికారుల వ్యవహారశైలిపై విచారణ జరపాలి

Satyam NEWS

కేరళలో భారీ పేలుడు: ఒకరు మృతి.. పలువురికి గాయాలు

Satyam NEWS

Another controversy: భారత్ వ్యతిరేకి అయిన బ్రిటన్ నేతతో రాహుల్ భేటీ

Satyam NEWS

Leave a Comment