28.7 C
Hyderabad
May 6, 2024 01: 48 AM
Slider నెల్లూరు

వి ఎస్ యూ లో గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శులకు శిక్షణ

#simhapuri university

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాగణంలోని శ్రీ పొట్టి శ్రీ రాములు భవన్ లో వార్డ్/ గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శుల (మహిళ పొలీసులకు) శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డా . ఎల్ .విజయ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శులకు గ్రామ సచివాలయం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన యంత్రాంగానికి  గుండెకాయ లాంటిదని అన్నారు.

ఇప్పటివరకు టీచర్లు ప్రజలకు దగ్గరగా వుండేవాళ్ళు. అయితే వై ఎస్   జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన  తరువాత గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసినప్పటి  నుండి గ్రామ సచివాలయ కార్యదర్శుల ప్రజలకు చాల చేరువలో వుంటున్నారని ఆయన అన్నారు. ప్రజలకు అత్యంత సమీపంలో ప్రభుత్వ ప్రతినిధులుగా వున్న గ్రామ సచివాలయ కార్యదర్శుల పైన గురుతర బాధ్యత వుందని ఆయన తెలిపారు.

అందువల్ల పోలీసులు మాట్లాడే మాట, వేషధారణ, ప్రవర్తన ఎదుటవారిని ఆకర్షించి మనల్ని వారు గౌరవించే విధంగా ఉండాలని తెలిపారు. ఎవరైనా సమస్య తో వస్తే మాట్లాడే సాంత్వన మాట ఎదుటి వారికి ఉపశమనం కలిగిస్తుందని కృష్ణారెడ్డి తెలిపారు. గ్రామ సచివాలయ సిబ్బంది అంత కూడా సకాలంలో  కార్యాలయానికి రావాలని, పనిని సవ్యంగానూ, సమర్ధవంతంగా చేయాలనీ తెలిపారు.

ఈ కార్యక్రమలో నెల్లూరు రూరల్ డి యస్ పి వై. హరినాధ రెడ్డి, నెల్లూరు రూరల్  ఇన్స్పెక్టర్ కే.వెంకట్ రెడ్డి, నెల్లూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి జగన్ మోహన్ రావు, కె పి పోర్ట్ ఇన్స్పెక్టర్ కె.వేమా రెడ్డి, వెంకటచలం పోలీస్ సెక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి చైతన్య క్రాంతి పాల్గొన్నారు.

Related posts

బ్రహ్మంగారిమఠం వద్ద తల్లీ కూతుళ్ల దారుణ హత్య

Satyam NEWS

రంగులు వేసుకోవడానికి తప్ప పాలనకు పనికిరాని పార్టీ

Satyam NEWS

అయినను పోయిరావలె హస్తినకు…: అమిత్ షా రమ్మన్నారోచ్

Satyam NEWS

Leave a Comment