25.2 C
Hyderabad
May 13, 2024 10: 47 AM
Slider గుంటూరు

వినాయకచవితి పందిళ్లకు అనుమతి లేదు

#ChilakaluripetPolice

వినాయక చవితి పందిళ్లకు అనుమతి లేదని గుంటూరు జిల్లా నరసరావుపేట డిఎస్పి విజయభాస్కరరావు తెలిపారు. శుక్రవారం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో వినాయక చవితి పoదిళ్లకు ప్రభుత్వం నుండి అనుమతి లేదన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఎవరికి వారు పండుగను తమ తమ గృహాలలోనే జరుపుకోవాలన్నారు.

వినాయక చవితి సందర్భంగా మండల ప్రజలకు పోలీసువారి హెచ్చరిక….

1.  వినాయక చవితి పండుగ సందర్భంగా బహిరంగ ప్రదేశంలో (పబ్లిక్ ప్లేసెస్) మండపాలు ఏర్పాటు చేయరాదు.

2. మండపాలు ఏర్పాటు చేసి వినాయకుని విగ్రహం పెట్టి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ కూడదు.

3.  అనగా డిజే పెట్టటం, మైకులు పెట్టటం, పాటకచేరి, భజనలు లాంటి వాటికి అనుమతి లేదు.

4.  వినాయక చవితి పండుగను గణేష్ విగ్రహాన్ని ఇళ్లలోనే ప్రతిష్టించాలి.

5. వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరేగింపుకు అనుమతి లేదు.

 6. ఏ ఇంటిలో విగ్రహం పెడతారో వారు మాత్రమే నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు ఆ ఇంటి వారు మాత్రమే విగ్రహాన్ని తీసుకుని వెళ్లాలి.

7. విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు ఊరేగింపులు టపాసులు కాల్చడం డప్పు వాయిద్యాలు పెట్టుకోవడం వంటి వాటికి అనుమతులు లేవు.

పై వాటిని ఉల్లంఘించినాచో కోవిడ్ నిబంధనల ప్రకారం చట్టరీత్యా చర్య తీసుకోబడును

Related posts

జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్ర .. పాక్ ఉగ్రవాది అరెస్ట్

Sub Editor

సహజీవనం చేస్తూ గొంతు కోసిన మృగాడు

Satyam NEWS

ఆందోళనకరంగా శాంతిభద్రతల పరిస్థితి ఉంది

Satyam NEWS

Leave a Comment