20.7 C
Hyderabad
December 10, 2024 01: 12 AM
Slider ఆంధ్రప్రదేశ్

రంగులు వేసుకోవడానికి తప్ప పాలనకు పనికిరాని పార్టీ

kanna twit

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పరిస్థితి ఏమిటి? క్షేత్ర స్థాయిలో బిజెపి బలపడటం ఎంత వరకు వచ్చిందో తెలియదు కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై దూకుడు మాత్రం తగ్గించలేదు. ఆ మధ్య తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు బాగా జరిగాయి కానీ ఈ మధ్య కాలంలో అది కూడా మందగించింది. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ సిపి వైపు వలసలు పెరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ పుంజుకునే అవకాశాలు ఏ మాత్రం కనిపించకపోవడంతో బిజెపి ఆంధ్రప్రదేశ్ పై పెద్ద పెద్ద ఆశలు పెంచుకుంటున్నట్లే కనిపిస్తున్నది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై దారుణమైన వ్యాఖ్యలు చేసేస్తున్నది. అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి ప్రధాన ప్రతిపక్ష పొజిషన్ లోకి వచ్చేయాలని బిజెపి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది. అంతకు ముందు తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతున్నదని విమర్శలు చేసి ఒక్క సారిగా బిజెపి తన కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఆ తర్వాత ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చీకాకులు తెప్పిస్తూనే ఉంది. బిజెపి నాయకులు ఇప్పటి వరకూ చేసిన విమర్శలు ఒక ఎత్తయితే నేడు బిజెపి ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ట్విట్ మరింత దారుణంగా ఉంది. రంగులు వేసుకోవడానికి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకూ పనికి రాదని కన్నా లక్ష్మీనారాయణ విమర్శ చేశారు. రంగులేసుకోవడం అంటే ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగు అయిన ఆకుపచ్చ, నీలం రంగులు వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్యాగ్ చేస్తూ కన్నా లక్ష్మీనారాయణ ఈ వ్యాఖ్య చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ కు పనికి రాదని కన్నా లక్ష్మీనారాయణ తీర్పు చెప్పేశారు. 150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్టుగా ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని 150 రూపాయల కూలి కూడా రాని పరిస్థితికి భవన నిర్మాణ కార్మికులను తీసుకువచ్చేశారని కన్నా లక్ష్మీనారాయణ ట్విట్ చేశారు. ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని నేను ఇంత వరకు చూడలేదని ఆయన ముక్తాయింపు ఇచ్చారు. ఇంత దారుణమైన విమర్శ బిజెపి నుంచి రావడంతో రానున్న రోజుల్లో బిజెపి రాజకీయ వేడి మరింతగా పెంచబోతున్నట్లు అనిపిస్తున్నది.

Related posts

తెలుగులోనూ మంచి ఆఫ‌ర్స్ వ‌స్తుండ‌డంతో హ్యాపీ

Satyam NEWS

మైనర్ బాలుడి హత్య మిస్టరీని ఛేదించిన విజయనగరం రూరల్ పోలీసులు

Satyam NEWS

ఫిబ్రవరి 23న విష్ణుసహస్రనామ పారాయణం

Satyam NEWS

Leave a Comment