27.7 C
Hyderabad
May 7, 2024 07: 14 AM
Slider గుంటూరు

గ్రామ రెవిన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి

#villagesecretary

గ్రామ రెవిన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని నవతరం పార్టీ జాతీయ కార్యదర్శి డా॥గోదా రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు గుంటూరు జిల్లా నరసరావుపేటలోని తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో గ్రామ రెవిన్యూ సహాయకుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షకు నవతరం పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ గోదా రమేష్ కుమార్ హాజరై నిరసన దీక్షలో ఉన్న గ్రామ రెవిన్యూ సహాయకులకు పూలమాలలు వేసి నిరసన దీక్షకు నవతరం పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసే సమయంలో గ్రామ రెవిన్యూ సహాయకులకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇస్తామని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని  నామినీలను విఆర్ ఎ లుగా తక్షణమే నియమించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

65 సంవత్సరములు దాటిన విఆర్ఎ కుటుంబంలో ఒకరిని విఆర్ఎగా నియమించాలని,ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ నివేదికలో గ్రామ రెవిన్యూ సహాయకుల ప్రస్తావన లేకపోవడం బాధాకరమని రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఎల అసోసియేషన్ చేపట్టిన నిరసన దీక్షకు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు మద్దతు తెలుపుతున్న నేపధ్యంలో ఈరోజు విఆర్ఎల నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని మార్చి 10వ తేదీన విఆర్ఎల అసోసియేషన్ చలో విజయవాడ పిలుపునిచ్చిన నేపధ్యంలో వారికి నవతరం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

Related posts

వైఎస్ఆర్ టిపి ములుగు మండల కమిటీ ఏర్పాటు

Satyam NEWS

తొలి రోజు ఓకే…. ఇక రాత్రి రోడ్లపైకి వస్తే జరిమానా తప్పదు

Satyam NEWS

మల్లారెడ్డి ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు

Murali Krishna

Leave a Comment