38.2 C
Hyderabad
April 29, 2024 21: 25 PM
Slider విజయనగరం

తొలి రోజు ఓకే…. ఇక రాత్రి రోడ్లపైకి వస్తే జరిమానా తప్పదు

#vijayanagarampolice

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసు లు రోజు రోజు కి పెరుగుతున్న దరిమిలా… ఈ నెల 18వ తేదీ రాత్రి నుంచీ కర్ఫ్యూ అమలు చేయాలని జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా….ఉదయం నేర సమీక్ష సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి మరీ కర్ఫ్యూ అమలు పై శాఖ సిబ్బంది కి ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో నే నగరంలో కర్ఫ్యూ ప్రారంభమైంది. అయితే కొన్ని చోట్ల పాక్షికంగా మరో కొన్ని చోట్ల పకడ్బందీగా కర్ఫ్యూ ను అమలు లోకి తీసుకొచ్చారు పోలీసులు. తొలి రోజు పదకొండు దాటితే రోడ్ మీదకు వచ్చే వారికి తెలియపరచాలని మరుసటిరోజు నుంచీ జరీమానాలు విధించాలని పోలీసు బాస్ చెప్పారు.

దీంతో పోలీసులు ఆ విధంగా నడుచుకోసాగారు. అడిషనల్ ఎస్పీ అనిల్ ,ట్రాఫిక్ డీఎస్పీ మోహనరావు, ఎస్ఐ లు దినకర్ ,అశోక్, భాస్కర్ రావులు….గంటస్థంబం ,కోట ,బాలాజీ జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కర్ఫ్యూ నిబంధనలు అమలు లోకి తెచ్చారు. కానీ వై జంక్షన్, కలెక్టరేట్ జంక్షన్ ల వద్ద కర్ఫ్యూ అమలు జాడ సత్యం న్యూస్. నెట్ కు అస్సలు కనిపించలేదు. ఏదైనా తొలి రోజు రాత్రి 11 గంటల నుంచీ రెండు గంటల వరకు పోలీసులు కర్ఫ్యూ నియమనిబంధనలను తెలియపరిచే యత్నం చేసారు. మరుసటి రోజు నుంచీ కర్ఫ్యూ సమయాలలో రోడ్లమీదకు వస్తే ఫైన్ లు తప్పవని హెచ్చరించారు…పోలీసులు.

Related posts

ఘనంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవం

Satyam NEWS

పంజాబ్ లో కెప్టెన్‌, కమలం మధ్య పొత్తు

Sub Editor

8న “మా” సంస్కృతి కళాపరిషత్తు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

Satyam NEWS

Leave a Comment