Slider ప్రత్యేకం

వాటికన్ వెళ్లిన సంచయితను సింహాచలంకు నియమిస్తారా?

sainchaitha

సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్ధరాత్రి జీవోతో నియమించిన సంచయిత హిందువా? లేక క్రైస్తవురాలా అనే అనుమానం ఉందని ఆంధ్రప్రదేశ్ (ఉత్తర విభాగం) విశ్వహిందూ పరిషత్ వెల్లడించింది. సంచయిత వాటికన్ చర్చికి వెళ్లడం, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి క్రైస్తవ మత పండుగలను నిర్వహించుకోవడం చూస్తున్నామని, ఆమె ఎక్కడా హిందువుల పండుగలు జరుపుకున్నట్లు దాఖలాలు లేవని విశ్వహిందూ పరిషత్ వెల్లడించింది.

అందువల్ల ఆమె అనుమానాస్పద ప్రవర్తనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్ కోరింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూ సమాజానికి వత్యిరేకంగా పలు నిర్ణయాలను తీసుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్ భావిస్తున్నది.

అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలకు చెందిన వేలాది ఎకరాల భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేసిందని విహెచ్ పి తెలిపింది.

రాజ్యాంగ విరుద్ధంగా క్రైస్తవ, ముస్లిం మత ప్రచారకులకు ప్రజాధనం నుండి వేతనాలు ఇవ్వాలనే నిర్ణయాలు, చర్చిల నిర్మాణాలకు ప్రభుత్వ ధనం కేటాయింపులు చేస్తున్న తీరునుబట్టి రాష్ట్ర ప్రభుత్వం హిందూ సమాజానికి వ్యతిరేకంగా క్రైస్తవ మత వ్వాప్తికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కూడా విశ్వ హిందూ పరిషత్ భావిస్తున్నది.

విజయనగర రాజవంశానికి చెందిన కుమారులను మాత్రమే నియమించాల్సిన సింహాచల దేవస్థాన ట్రస్టు బోర్డు నియామకం, మాన్సాస్ ట్రస్టు బోర్డు నియమ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సంచయితను నియమించిన తీరు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నదని విహెచ్ పి తెలిపింది.

హడావుడిగా అర్ధ రాత్రి జీవోలు జారీ చేయడం అనుమానాలను బలపరుస్తున్నదని విహెచ్ పి చెప్పింది. రాష్ట్రంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో హిందువులపైనా, హిందూ దేవాలయాల పైనా, ఆలయ దేవతా మూర్తుల పైనా హిందూ ధార్మిక సంస్థల పైనా హిందూ అనుకూల కార్యకర్తలపైనా దాడులు పెరిగాయని విశ్వహిందూ పరిషత్ వెల్లడించింది.

గతంలో ఇదే కుటుంబానికి చెందిన వ్యక్తి పాలనలో తిరుమల ఏడు కొండలను రెండు కొండలుగా మార్చే ప్రయత్నం జరిగిందని, అదే కోణంలో నేడు హాథీరామ్ జీ మఠం స్వాధీనం, మాన్సాస్ ట్రస్టు బోర్డు నియామకం, హిందూ మత ఆలయాల్లో అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని విశ్వ హిందూ పరిషత్ వెల్లడించింది.

అన్య మత సిబ్బందిని తొలగించాలని ఎన్ని సార్లు కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం తమ అనుమానాలను మరింత బలపరుస్తున్నదని వారన్నారు. ట్రస్టులు, దేవాలయాల ఆదాయాలు నేరుగా రాష్ట్ర ఖజానాకు జమ అయే విధంగా జీవోలు జారీ చేయడం ద్వారా హిందూ దేవాలయాల ఆదాయాలను రాష్ట్ర ప్రభుత్వం కాజేయాలని చూస్తున్నట్లు అర్ధం అవుతున్నదని విహెచ్ పి స్పష్టం చేసింది.

ఇటీవల పిఠాపురం, బిట్రగుంట, ఉండ్రాజవరం దేవాలయాలపై దాడులు, విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలు దగ్ధం చేయడం వంటి సంఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిలువరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విహెచ్ పి ఆరోపించింది. సింహా చలం దేవస్థానానికి మాన్సాస్ ట్రస్టుకు పద్మనాభ స్వామి ఆలయానికి కలిపి సుమారుగా 30 వేల ఎకరాల భూములు విశాఖ పరిసర ప్రాంతాలలో ఉన్నాయని వాటిని కాజేసే ప్లాన్ లో భాగంగానే ఈ విధంగా పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు అనుమానం కలుగుతున్నదని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది.

ఈ విషయాలలో తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలోని అందరు స్వామీజీలు, హిందూ ధార్మిక సంస్థలు, హిందూ సమాజం ఉద్యమం చేయడం తప్ప వేరే మార్గం ఉండదని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది.

Related posts

తొమ్మిది మంది అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్

Murali Krishna

విజయనగరం ఎస్ పి చొరవతో పురోగమిస్తున్న స్టూడెంట్ పోలీస్ కేడిట్

Satyam NEWS

అప్పుల భారం ఉన్న టాప్‌-10 రాష్ట్రాల్లో ఏపీ

Satyam NEWS

Leave a Comment