31.2 C
Hyderabad
May 2, 2024 23: 46 PM
Slider మహబూబ్ నగర్

తెలంగాణ లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

#MinisterNiranjanReddy

తెలంగాణలో పేద ఆర్యవైశ్యులు ఆర్థికంగా ఎదగాలంటే ప్రభుత్వం చేయూతనివ్వాలని,  ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆర్యవైశ్య మహసభ తెలంగాణ రాష్ట్ర   ఉపాధ్యక్షుడు యిటుకూరి వీరయ్య గుప్త కోరారు.

వనపర్తి జిల్లా అధ్యక్షుడు బాదం సుధాకర్, జిల్లా  ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి మల్లికార్జున్, రాష్ట్ర సభ్యులు సాయి ప్రసాద్, అశోక్ లతో కలిసి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు.

ఈ మేరకు వారు వనపర్తిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడాలని వారు మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు. 

ఆర్యవైశ్యులలో చాలా మంది పేదలు ఉన్నారని, బయటకు చెప్పుకోలేక దుర్భర జీవితాలను గడుపుతున్నారని, సరళీకృత ఆర్థిక విధానం తో పెద్ద చిన్న పట్టణాల్లో సైతం వాణిజ్య సముదాయాలు ఏర్పాటు కావడంతో వ్యాపారాలు సాగడం లేదని తెలిపారు. 

వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న ఆర్యవైశ్యులకు ఉపాధి కరువైందని ప్రభుత్వం స్పందించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్యవైశ్యులు ఆర్థికంగా రాజకీయంగా ఎదుగాలేకపోతున్నారని చెప్పారు. కార్పొరేషన్ తో పాటు ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పోస్టుల్లో భాగస్వాములు చేయాలని కోరారు.

ఇప్పటికే ఆర్యవైశ్యుల సౌకర్యం నిమిత్తము ఉప్పల్ భగాయత్ లో 5 ఎకరాల స్థలమును కేటాయించడం పట్ల ఆర్యవైశ్యులు అందరం సంతోషిస్తున్నామని అన్నారు. అభ్యర్థనను పరిశీలించి మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ

Related posts

మరో యువతిపై ఇంట్లోనే అత్యాచార యత్నం

Satyam NEWS

గంటస్తంభం సాక్షి గా…పోలీసులు నిర్వర్తించిన విధులేంటో తెలుసా…!

Satyam NEWS

జీవో కు విరుద్ధంగా రుణమాఫీ చెల్లింపులు

Satyam NEWS

Leave a Comment