37.7 C
Hyderabad
May 4, 2024 14: 58 PM
Slider మహబూబ్ నగర్

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

#WanaparthySP

బుధవారం  వనపర్తి పట్టణంలోని వివేకానంద చౌరస్తా, రాజీవ్ చౌరస్తా, బస్టాండ్, రామాలయం,  కొత్తకోట, ఆత్మకూరు, వివిధ ప్రాంతాల్లో వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు  ఆకస్మిక తనిఖీ చేసి కొనసాగుతున్న తీరును పరిశీలించి,పలు వాహనదారులను ఆపి తనిఖీ చేసి వారి వివరాలు వారు బయటకి రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకి రాకూడదని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ అవసరంగా ఎలాంటిపనులులేకున్నా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ , అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు.

కరోన ప్రజల ఆరోగ్య శ్రేయస్సుకై తమ ప్రాణాలను ఫణంగా పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. లాక్ డౌన్ , కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అత్యవసర పనిపై ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారికి ఈ రోజు వరకు ఆన్ లైన్  ఈపాస్ ద్వారా 625 పాసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై  (658) ఈ పెట్టి కేసులు నమోదు చేశామని తెలిపారు.

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి కలిసికట్టుగా చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

నిర్లక్ష్యంగా భౌతిక దూరం పాటించకుండా గుమికూడి ఉండడం, అనవసరంగా ఏ కారణం లేకుండా బయట తిరగడం శ్రేయస్కరం కాదని హితవు పలికారు, ప్రస్తుత విపత్కర పరిస్థితులను ప్రజలంతా తమకు తాము రక్షించుకుంటూ సమాజాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యత

Satyam NEWS

హుజూర్ నగర్ లో ఈనెల 27న టియుడబ్ల్యూజే జిల్లా మహాసభ

Bhavani

ఎమ్మెల్యే బొల్లా నుండి నాకు ప్రాణహాని ఉంది ..

Satyam NEWS

Leave a Comment