33.2 C
Hyderabad
May 15, 2024 21: 41 PM
Slider మహబూబ్ నగర్

అభివృద్ధి కాదు,అవినీతి జరిగింది:మెగారెడ్డి

#gegareddy

వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని అంతా అవినీతి ఉందని వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి తూడి మెగా రెడ్డి విమర్శించారు. శుక్రవారం నామినేషన్ అనంతరం భారీ ప్రదర్శన నిర్వహించి వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మంత్రి నిరంజన్ రెడ్డి అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్నారని అవినీతి మాత్రమే కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ ఆలయ భూములు కబ్జా చేశారని, వనపర్తి లో చెరువుల అభివృద్ధి పేరుతో అవినీతి చేశారని ఆరోపించారు. నియోజకవర్గంలో నియంత పాలన సాగుతోందని ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెప్పాలన్నారు. గెలిపిస్తే ఐదేళ్లు అవినీతి లేని పాలన అందిస్తామన్నారు.

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు, జూరాల, భీమా, కోయిల్ సాగర్ పలు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, మూడెకరాల భూమి ఎవరికి అందలేదన్నారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలుచేసి ప్రజలకు సంక్షేమం అందిస్తామన్నారు. ప్రభుత్వం వస్తే డాక్టర్ జి.చిన్నారెడ్డి మంత్రి అవుతారని, వనపర్తి అభివృద్ధికి తాను అంకితమవుతానన్నారు. ఓట్లేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ ఇది మెగా రెడ్డి విజయోత్సవ సభలా ఉందన్నారు. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేదని, ఎన్నికల్లో గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అంకితనిద్దామన్నారు.

ఎమ్మెల్యేగా మంత్రిగా 20 ఏళ్లు నీతివంతమైన పాలన అందించానన్నారు. గతంలో అవినీతి లేదని మంత్రి భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.రావుల చంద్రశేఖర్మా రెడ్డి, తాను ఎమ్మెల్యేగా నిజాయితీగా సేవ చేశామని చెప్పారు. మాజీ ఎంపీ మల్లురవి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెగా రెడ్డిని గెలిపించాలని కోరారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రాచాల యుగంధర్ గౌడ్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లు రేషన్ కార్డులు మూడెకరాల భూమి వచ్చాయా అని ప్రశ్నించిన మెగా రెడ్డి, ప్రజల నుంచి “రాలేదు” సమాధానం రాబట్టారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

శోభాయమానంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

వైసీపీని గద్దె దించేవరకూ పోరాడుతూనే ఉంటా

Satyam NEWS

బి.సి.నేతల అరెస్ట్ అక్రమం

Satyam NEWS

Leave a Comment