29.7 C
Hyderabad
May 3, 2024 05: 35 AM
Slider చిత్తూరు

పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యేపై పార్టీనేతల తిరుగుబాటు

#msbabu

పూతలపట్టు ఎమ్మెల్యే MS బాబు మీద తిరుగుబాటు భావుటా కొనసాగుతోంది. వ్యతిరేకులు విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. మాజీ ఎంపీపీ సుగుణాకర్ రెడ్డి, ఎంపిటిసి లోకేష్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కృపా సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ల సంఘం  అధ్యక్షుడు దయాసాగర్ రెడ్డి, నాయకులు మునిరత్నం, వెంకటముని శెట్టి, ప్రభాకర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, చిట్టి రెడ్డి తదితరులు చిత్తూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, పూతలపట్టు MLA MS బాబు మీద తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మళ్ళీ MS బాబుకు టిక్కెట్టు ఇస్తే అయన విజయానికి పనిచేసేదిలేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే ఐదు మండలాల్లో వర్గాలు పెట్టి, కాణిపాకం టెండర్లను టిడిపికి అమ్ముకున్నారని విమర్శలు గుప్పించారు. తాజాగా మహిళా శిశు సంక్షేమ శాఖ రాయలసీమ జోనల్ చైర్మన్ శైలజ చరణ్ రెడ్డి కాణిపాకంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఈ గూండా ఎమ్మెల్యే మాకు వద్దని అన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే MS బాబు అనుచరుల గుండ్లపల్లి ఎంపీటీసీ సభ్యుడి తల్లిదండ్రులపై దాడి చేసి కొట్టారని ఆరోపించారు.

పూతలపట్టు ఎమ్మెల్యే MS బాబు అనుచరుల గుండ్లపల్లి ఎంపీటీసీ సభ్యుడి తల్లిదండ్రులపై దాడి చేసి కొట్టారని మహిళా శిశు సంక్షేమ శాఖ రాయలసీమ జోనల్ చైర్మన్ శైలజ చరణ్ రెడ్డి ఆరోపించారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఏంఎస్ బాబు పనితీరు తమకు నచ్చక, వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైఎస్ఆర్ సీపీ తరఫున టికెట్ ఇవ్వవద్దని చిత్తూరులో జరిగిన ప్రెస్ మీట్ ద్వారా పూతలపట్టు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్రనాయకత్వానికి తెలిపామన్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే తన అనుచరులను గుండ్లపల్లి ఎంపీటీసీ సభ్యులు లోకేశ్వర్ రెడ్డి ఇంటికి పంపి, లోకేష్ రెడ్డి తల్లిదండ్రులపై భౌతిక దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సంఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు.

పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు చర్యలు రాను రాను మితిమీరిపోతున్నాయని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలకు ఎవరు అడ్డుపడినా వారి ఆస్తులు, ఆర్థిక వనరులపై దాడులు చేయిస్తారని తెలిపారు. అప్పటికి లొంగకుంటే భౌతిక దాడులకు సైతం పాల్పడేందుకు వెనకాడరని మండిపడ్డారు. ఇటీవల పార్టీ అధినేత,  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే వేడుకలు నిర్వహించిన పలువురు రేషన్ షాపుల యజమానులను పలు రకాలుగా వేధింపులకు గురిచేశారని తెలిపారు.

గతంలో తన భర్త చరణ్ రెడ్డి పైన సైతం ఎమ్మెల్యే అనుచరులు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. తనకు ఘన విజయం అందించిన పార్టీ నాయకులు,  కార్యకర్తలను,  ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి గూండాగిరి చేస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు తమకు వద్దని మరొకసారి స్పష్టం చేశారు. అయితే తాము జగన్మోహన్ రెడ్డి, జిల్లాకు చెందిన వైఎస్ఆర్సిపి ముఖ్య నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విధేయులుగా ఉంటామని, వారి అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ రాయలసీమ జోనల్ చైర్మన్ శైలజ చరణ్ రెడ్డి  తెలిపారు.

Related posts

మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టిక్కెట్

Satyam NEWS

జగనన్న భవిష్యత్తు కాదు… సామాన్య ప్రజలకు విపత్తు

Satyam NEWS

Leave a Comment