30.2 C
Hyderabad
May 13, 2024 13: 14 PM
Slider ఖమ్మం

ముంపు బాధితులను అండగా ఉంటాం

#flood victims

మున్నేరు ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ నగరంలోని బొక్కలగడ్డ ప్రాంతంలో పర్యటించి, ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, బాధితులకు ధైర్యం చెపుతూ, ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.

అధికారులు నష్ట అంచనాలను తయారుచేయాలన్నారు. పారిశుద్ధ్యం పకడ్బందీగా చేపట్టాలని, అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ కు చర్యలు తీసుకోవాలని అన్నారు. క్లోరిన్ మాత్రలు ఇంటింటికి పంపిణీ చేయాలని, త్రాగునీటిలో క్లోరిన్ మాత్రలు వాడాలని అన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు తేమలో ఆన్ చేయవద్దని, విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

కలెక్టర్ పర్యటన సందర్భంగా నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దోరేపల్లి శ్వేత, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో స్వర్ణలత, మునిసిపల్ ఉప కమీషనర్ మల్లీశ్వరి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, అధికారులు తదితరులు వున్నారు.

Related posts

కేంద్ర ఉద్యోగులకు పెన్షనర్లకు షాక్ ఇవ్వడం అన్యాయం

Satyam NEWS

Mega News: `లూసీఫ‌ర్` గా వస్తున్న మెగాస్టార్ చిరంజీవి

Satyam NEWS

రామంతపూర్ వార్డ్ ఆఫీస్ లో దీపావళి సబరాలు

Satyam NEWS

Leave a Comment