38.2 C
Hyderabad
April 28, 2024 21: 57 PM
Slider ఖమ్మం

ఓటర్ జాబితా తయారీకి సహకరించాలి

#voter list

తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహాకరించాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఐడిఓసిలోని కలెక్టర్ చాంబర్లో ఓటరు నమోదు, పోలింగ్ కేంద్రాలు మార్పు, ఓటరు తొలగింపు, ఓటరు చిరునామా మార్పు, ఫోటో సిమిలర్ ఎంట్రీలు, ఫారం 6,7,8 విచారణ ప్రక్రియ తదితర అంశాలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో రాజకీయ పార్టీలు బూతు ఏజంట్లను నియమించి, అట్టి జాబితాను కలెక్టరేట్లో అందచేయాలని చెప్పారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు ఓటుహక్కు కోల్పోడానికి అవకాశం లేకుండా పకడ్బందీగా జాబితా తయారు చేయుటకు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి ఐడిఓసిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఫోటో సిమిలర్ ఎంట్రీస్ వచ్చిన 18438లో 508 తొలగించామని, వాటిలో 38 మంది మరణించగా, 92 మంది ఇతర పోలింగ్ కేంద్రాలకు వలస వెళ్లినట్లు చెప్పారు. ఓటర్లు తొలగింపు తప్పుగా నమోదైన 378లో 150 మంది ఓటర్లుగా నమోదు చేశామని, 228 మంది ఓటుహక్కు పొందాల్సి ఉన్నట్లు చెప్పారు. ఈ 228 మందిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ఫారం 6 జారీ చేస్తామని, వీరిని ఓటర్లుగా నమోదు చేయుటలో రాజకీయ పార్టీలు సహాకారం అందించాలని చెప్పారు.

జిల్లాలో 5.1.2022 నుండి 5.1.2023 వరకు 30534 మందిని ఓటరు జాబితా నుండి తొలగించామని, వాటిలో 26908 విచారణ ప్రక్రియ పూర్తికాగా 1139 తొలగింపులో లోపాలున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. వీరందరిని ఓటర్లుగా నమోదు చేయుటకు ఫారం 6 జారీ చేస్తున్నట్లు చెప్పారు. 6346 మంది ఓటర్లు ఒక పోలింగ్ కేంద్రం నుండి మరొక పోలింగ్ కేంద్రం పరిధిలోకి మారినట్లు గుర్తించామని, అట్టి ఓటరు జాబితాను తహసిల్దార్, నాయబ్ తహసిల్దార్లు విచారణ నిర్వహించిన 4273 మంది ఓటర్లులో 52 మంది ఓటర్లును నమోదు చేసేందుకు గుర్తించామని, వారిని ఓటరుగా నమోదు చేయుటకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

పెండింగ్లో ఉన్నవి తక్షణమే విచారణ నిర్వహించి అర్హులను ఓటరుగా నమోదు చేపించుటకు చర్యలు చేపట్టాలని ఆయన తహసిల్దారులను ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న పోలింగ్ కేంద్రాలు మార్చాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించగా అట్టి వివరాలను అందచేయాలని, మార్పు కొరకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఎన్నికల విభాగం తహసిల్దార్ సురేష్ కుమార్, సిబ్బంది నవీన్, సిపియం నుండి అన్నవరపు సత్యనారాయణ, సిపిఐ నుండి సలిగంటి శ్రీనివాస్, బిజెపీ నుండి అక్ష్మణ్ అగర్వాల్, బిఆర్ఎస్ నుండి షేక్ అన్వర్, బిఎస్పి నుండి వై కామేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతుల మేలు కోసమే నియంత్రిత సాగు విధానం

Satyam NEWS

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలించరాదని భాజపా నిరసన

Satyam NEWS

పాలియేటీవ్ కేర్ కు SBI ఫౌండేషన్ భారీ విరాళం

Satyam NEWS

Leave a Comment