29.7 C
Hyderabad
May 6, 2024 04: 32 AM
Slider నల్గొండ

అక్రమాలను వ్యతిరేకిస్తాం….అభివృద్ధిని స్వాగతిస్తాం

$hujurnagar

అధికార పార్టీ చేసిన తప్పులని అభివృద్ధి ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ పైపులైన్ల విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని,మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో తాగునీటి కోసం వాడే పైపులైన్ల ఎస్టిమేట్స్ లో అనేక అవకతవకలు జరిగాయని,నెల రోజులు తిరగక ముందే మున్సిపల్ తీర్మానంలో కేటాయించిన నిధులని రెండింతలు చేసి ఎస్ డి ఎఫ్ నిధులతో పనులు జరిపించాలని చూడడం నిజం కాదా? అని శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన 25 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధుల్లో పాలకవర్గం నుంచి ఎటువంటి తీర్మానం లేకుండా పనులు జరపటాన్ని మొదటి నుండి ప్రతిపక్ష కౌన్సిలర్లుగా తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.అట్టి నిధులని హుజూర్ నగర్ మున్సిపాలిటీ పాలకవర్గం తీర్మానంతో జరిపినట్లైతే పనుల్లో అవినీతి లేకుండా పారదర్శకత ఉంటుందని, తాము మొదటి నుండి చెపుతున్నామని, అట్టి పనులు మున్సిపల్ పరిధిలో కాకుండా పబ్లిక్ హెల్త్ తో చేయించటంతో ప్రస్తుతం ఇందిరా సెంటర్ నుండి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు వేసినటువంటి ఒకవైపు రోడ్డు నెల రోజులు గడవక ముందే అనేకచోట్ల పగుళ్లు రావడం ఇందుకు నిదర్శనమని అన్నారు.

గత రెండు నెలల క్రితం కోర్టులో కేసులు కొట్టివేయబడ్డాయని ఇందిరా సెంటర్లో స్వీట్లు పంచుకొని బాణాసంచా పేల్చిన విషయం పట్టణ ప్రజలు ఇంకా మరిచి పోలేదని,అధికార పార్టీ నాయకులు వారు చేసే అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అభివృద్ధి అనే ముసుగు వేసుకొని పదేపదే  ప్రజలను,ప్రజా ధనాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని,మున్సిపాలిటీ నిధులు,మరే ప్రత్యేక నిధులు పట్టణ అభివృద్ధి కోసం కేటాయించినా తమ సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని,పైపులైన్ల విషయంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో బహిరంగ చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధమని,కమిషన్ల కోసం నాణ్యతలేని పనులు చేస్తూ ప్రజా ధనాన్ని, ప్రభుత్వ ఆస్తులని కాజేయాలని చూస్తే ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులుగా ప్రజల కోసం పోరాటం చేయడంలో ముందుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి,తేజావత్ రాజా నాయక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలు,కారింగుల వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

మెగా కంఠంలో నేనొక నటుడ్ని షాయరీ

Bhavani

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై వచ్చే నెలలో కోర్టు తీర్పు?

Satyam NEWS

నేటితరానికి బీజేపీ నేత జాం మద్దిలేటి ఆదర్శప్రాయులు

Satyam NEWS

Leave a Comment