31.7 C
Hyderabad
May 7, 2024 01: 10 AM
Slider నల్గొండ

అనాధ వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారులు

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం లోని జిప్సీ అనాధ వసతి గృహాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మ, జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ (డిఐసి)తో కలిసి సందర్శించారు.

హోమ్ లో పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలను రిజిస్టర్,రికార్డులను పరిశీలించి పిల్లలకు మంచి సౌకర్యాలను కల్పించాలని,విద్య,ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలని అన్నారు.పిల్లలకు విశాల వంతమైన ప్రత్యేక వసతులు కలిగిన గదులను ఏర్పాటు చేయాలని, పిల్లలకు మంచి విద్యను అందించినట్లైతే వారిని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్ద గలిగిన వాళ్ళమౌతామని వసతి గృహ నిర్వాహకులు దన్ పాల్ కి తెలియజేశారు.    

ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ రమణారావు,బి ఆర్ బి కో-ఆర్డినేటర్ వెంకట లక్ష్మి,డి సి పి ఓ రవి కుమార్,సభ్యులు ధనమ్మ,బిక్షం,రామిరెడ్డి,హుజూర్ నగర్ సిడిపిఓ విజయలక్ష్మి,పిఓ విద్యాసాగర్, నాగుల్ మీరా,చైల్డ్ లైన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

పెదవేగి ఎంపిపిగా తాతా రమ్య ప్రమాణస్వీకారం రేపు

Satyam NEWS

రైతులు విడి విత్తనాలు కొనుగోలు చేయవద్దు

Satyam NEWS

రాజప్రాసాదం దాటి బయటకు రాని యువ ముఖ్యమంత్రి

Satyam NEWS

Leave a Comment