February 28, 2024 09: 10 AM
Slider సంపాదకీయం

మాజీ సీఎం కేసీఆర్ బీజేపీ వైపు చూస్తున్నారా?

#KCR

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓడిపోతే ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకుంటా అని ఆయనే చెప్పాడు కదా? మరేం చేస్తాడు…. అదే చేస్తాడు అనుకుంటున్నారా? కచ్చితంగా అది కాదు ఆయన చేస్తున్నది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో చురుకుగా పాల్గొని జాతీయ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పాలా అని ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో జరిగే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో బీజేపీపైనే భీకర యుద్ధం అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్‌పై భీకర యుద్ధం.. బీజేపీతో ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేయాలని డిసైడయ్యారు.

అందుకే తన పార్టీ సిద్ధాంతాలను కూడా హిందూత్వం వైపు మళ్లించారు. బీజేపీపై యద్ధం ప్రకటించినా.. మళ్లీ కాల్పుల విరమణ ప్రకటించినా కేసీఆర్ రాజకీయ వ్యూహం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో స్నేహంగా ఉండటం కీలకమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చి దానికి తగ్గట్లుగా పరిస్థితులు మార్చారని అంటున్నారు. రాజకీయ కారణాలు, వ్యక్తిగత ప్రయోజనాల రీత్యా బీఆర్‌ఎస్‌ మళ్లీ బీజేపీకి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… ఈ సంకేతాలను పంపడంలో చాలా యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. కవిత ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాకుండా.. మొత్తం కాంగ్రెస్ కూటమిని కవిత తప్పు పడుతున్నారు. కవిత తీరు చూస్తే.. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఆమె అన్న, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాత్రం మజ్లీస్ చేజారిపోకుండా చూసుకుంటున్నారని చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ వైపు తొంగి చూస్తున్నట్లుగా అనుమానం వచ్చింది. దాంతో ఆయన మజ్లీస్ తో సఖ్యత కొనసాగించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. అన్న ఒక వైపు, చెల్లి ఒక వైపు వెళుతుండగా కేసీఆర్ ఏది లాభసాటి అయితే దాన్ని ఫాలో అయ్యేందుకు వేచి ఉన్నారని కూడా కొందరు అంటున్నారు.

అయితే బీజేపీ వైపు ఉండటం ఇప్పుడు ముఖ్యమనే భావనలోనే కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. అందుకే పార్లమెంటులో పొగబాంబు ఘటన, ఆ సందర్భంగా 146 మంది ఎంపీలను సభ నుంచి బహిష్కరించటం తదితర పరిణామాలపై బీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకూ స్పందించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ మళ్లీ తెరపైకి వస్తే కవిత ఇబ్బంది పడతారు. కాపాడుకోవడానికి అధికారం కూడా లేదు.

మరో వైపు కాంగ్రెస్ విచారణలతో దాడి చేయడానికి రెడీగా ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పరోక్షంగా అయినా రాజీ చేసుకుని ముందకెళ్లడమే మంచిదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే కవిత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ హిందూత్వ వాదం వినిపిస్తున్నారని అంటున్నారు.

Related posts

డిమాండ్:బలహీన వర్గాల మహిళలపై అత్యాచారాలు అరికట్టాలి

Satyam NEWS

55 రాజ్యసభ ఖాళీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

Satyam NEWS

బీజేపీ రైతు వ్యతిరేక చర్యలపై పోరాటానికి టీఆర్ఎస్ సన్నద్ధం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!