38.2 C
Hyderabad
April 28, 2024 21: 33 PM
Slider ప్రత్యేకం

నీతి ఆయోగ్‌ సభ్యుడిగా అర్వింద్‌  వీర్మానీ

#arvind

నీతి ఆయోగ్‌ సభ్యుడిగా ఫౌండేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ గ్రోత్‌ అండ్‌ వెల్ఫేర్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అర్వింద్‌ వీర్మానీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌  ఉత్తర్వులు జారీచేసింది.  ప్రధానమంత్రి ఆమోదంతో ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆ సంస్థలో సభ్యులుగా వీకే సారస్వత్‌, ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్‌, వీకే పాల్‌ ఉన్నారు. వీర్మానీ నియామకంతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది. ఈయన 2009లో ఐఎంఎఫ్‌లో భారత ప్రతినిధిగా నియమితులయ్యారు. 2012 చివరి వరకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో డాక్టరేట్‌ చేశారు.

Related posts

గురుకుల పాఠశాల తరలింపు అన్యాయం

Satyam NEWS

ప్రతీ ఇంటి పైన మువ్వన్నెల జెండా ఎగరేద్దాం

Satyam NEWS

జనతా కర్ఫ్యూ పాటించాలని హైదరాబాద్ పోలీసు పిలుపు

Satyam NEWS

Leave a Comment