28.7 C
Hyderabad
May 6, 2024 02: 15 AM
Slider ప్రత్యేకం

తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరు?

#CS of Telangana

హైకోర్టు తీర్పు నేపథ్యంలో పదవి కోల్పోయిన సోమేశ్ కుమార్ స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు రాబోతున్నారు? తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణా కొత్త సీఎస్‌గా ఎవరిని నియమించాలనే కసరత్తు మొదలైంది. సోమేశ్‌కుమార్‌ మంగళవారం రాత్రి సీఎంను కలిసి వచ్చిన తర్వాత సాధారణ పరిపాలనశాఖ అధికారులు నియామకానికి సంబంధించిన ముసాయిదా ఉత్తర్వులు సీఎం కార్యాలయానికి పంపించారు.

ఏపీలో చేరడానికి సోమేశ్‌కుమార్‌కు 12వ తేదీ వరకు గడువున్నందున కొత్త సీఎస్‌పై నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆయనను రిలీవ్‌ చేస్తారు. సీనియారిటీ పరంగా సీఎస్‌ పదవికి వసుధా మిశ్రా (1987 బ్యాచ్‌), వై. శ్రీలక్ష్మి (ఏపీలో డెప్యుటేషన్‌), రాణి కుముదిని (1988), శాంతికుమారి, అశోక్‌కుమార్‌ (కేంద్ర సర్వీసు-1989), శశాంక్‌గోయల్‌ (కేంద్ర సర్వీసు), సునీల్‌శర్మ (1990), కె.రామకృష్ణారావు, అర్వింద్‌కుమార్‌, రజత్‌కుమార్‌ (1991)లు అర్హులుగా ఉన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో రామకృష్ణారావు తదుపరి సీఎస్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌కుమార్‌, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారిల పేర్లు సైతం పరిశీలన జాబితాలో ఉన్నాయి.

Related posts

ప్రొటెస్టు: ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లను అమలుచేయనివ్వం

Satyam NEWS

దళితులను మరోసారి మోసం చేసిన కెసిఆర్

Satyam NEWS

జగన్ కు పోటీగా ఏపిలో కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందా???

Satyam NEWS

Leave a Comment