42.2 C
Hyderabad
April 26, 2024 16: 44 PM
Slider నల్గొండ

నిరుద్యోగులకు వయో పరిమితి నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలి

#hujurnagar

నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ సీనియర్  జెఏసి నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జెఏసి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది సీనియర్ నిరుద్యోగుల వయస్సు గరిష్ట వయోపరిమితిని మించిపోయిందని, గ్రూప్ 1,గ్రూప్ 3,జె ఎల్,డి ఎల్ వంటి ఉద్యోగాలకు ఇప్పటివరకు నోటిఫికేషన్ జారీ కాలేదని అన్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో నోటిఫికేషన్లు రాలేదన్నారు. వయసు గరిష్ట పరిమితిని మించిపోయిన నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం పొందేలా వయోపరిమితిని నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని అన్నారు. దీని వల్ల రిజర్వేషన్లు పొందే వారికి కూడా 52 సంవత్సరాల లోపు ఉన్న వారికి కూడా అవకాశం ఉంటుందని అన్నారు. ఇప్పుడు జారీ చేయబోతున్న నోటిఫికేషన్ అన్నిటికీ ఈ అవకాశం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిహెచ్ వెంకటేశ్వర్లు,ఆర్.వెంకటేశ్వర్లు,ఏ. రామారావు,ఏ.విజయ్ కుమార్,కె.సతీష్, డి.వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నవరత్నాలతో మైనారిటీలకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

ట్రాఫిక్ రూల్సు పాటిస్తే ప్రమాదాలు జరగవు

Bhavani

చేజర్ల మంచినీటి సమస్యకు ఎత్తి పోతల పరిష్కారం

Bhavani

Leave a Comment