సీఎఎ, ఎన్‌పీఆర్‌లపై వ్యతిరేకత ఎందుకో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎంఐఎం, వామపక్షాలు సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందువులకు వ్యతిరేకం కాదంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కంటితుడుపు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ‘దేశంలో 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే..హిందువులను అంతం చేస్తామన్న వ్యాఖ్యలు హిందువులకు వ్యతిరేకం కాదా.. హిందువుల పట్ల వ్యతిరేకత లేకపోతే అయోధ్య అంశంలో సుప్రీం కోర్టు తీర్పును ఎంఐఎం ఎందుకు తప్పుబట్టింది. లౌకికవాద పార్టీ అంటూ గొప్పగా ప్రకటించుకునే టీఆర్ఎస్ పార్టీ సి.ఎ.ఎ, ఎన్.పి.ఆర్ ను ఎందుకు వ్యతిరేకిస్తోంది’ అని ప్రశ్నించారు.
previous post