28.7 C
Hyderabad
May 5, 2024 10: 59 AM
Slider ముఖ్యంశాలు

వితంతువులు మనోధైర్యంతో ముందుకు సాగాలి

#warangal

వితంతువుల పట్ల సామాజిక వివక్షతను రూపుమాపడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్సువల్ డిజేబులిటీ భారత ప్రభుత్వ సంస్థ ప్రతినిధి అంజి రెడ్డి అన్నారు.

ప్రపంచ వితంతు, ఒంటరి మహిళా దినోత్సవం సందర్భంగా, వితంతు ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం డైరెక్టర్ సంద బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అంజిరెడ్డి మాట్లాడుతూ సాధారణ మహిళలతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని, గతాన్ని మర్చిపోయి సామాజిక జీవనంలో మెరుగైన అభివృద్ధి సాధించడానికి సరైన జీవనోపాదుల ను ఎంపిక చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు.

వితంతువులు సానుకూల భావనతో మెలగాలని, తెలివితేటలు, శక్తిసామర్ధ్యాలను వినియోగించుకుంటూ, సమయాన్ని వృధా చేసుకోకుండా జీవన నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు. వివక్ష కు లోనై ఆత్మ గౌరవాన్ని కోల్పోకుండా సానుకూల దృక్పథంతో విజయం సాధించి సాధారణ మహిళలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు.

వివక్షతను రూపుమాపడంలో మహిళలు, రైతులు, యువతీ, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సేవకులు, సామాజికవేత్తలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, సామాజిక నిపుణులు భాగస్వాములు కావాలని సూచించారు.

యువ వితంతువులు భవిష్యత్తుపై దృష్టి సారించి,  చైతన్యవంతులై కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ గుళ్లేపల్లి సాంబయ్య, మాత పిత వెల్ఫేర్ సొసైటీ  బాధ్యులు సుమన్, రాజేంద్రప్రసాద్, రామ్మోహన్ వివిధ మండలాల వితంతువులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర వ్యాప్తంగా మాలలను చైతన్యం చేయాలి

Satyam NEWS

కరోనా సోకినా బాధితులకు హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీ

Satyam NEWS

రోడ్డు పై కూర్చొని నిరసన తెలియజేస్తున్న చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment