37.2 C
Hyderabad
May 6, 2024 12: 52 PM
Slider ప్రత్యేకం

మంగళగిరి ఎన్ ఆర్ ఐ మెడికల్ కేసులో ఇక అరెస్టుల పర్వం?

#NRI Hospital

మంగళగిరి ఎన్ ఆర్ ఐ మెడికల్ కేసులో ఇక అరెస్టుల పర్వం? తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు, అరెస్టుల పర్వంలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టారు.

ప్రముఖ నాయకులను ఏదో ఒక కేసులో అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కొల్ల రవీంద్ర ల నుంచి సంగం డైరీ కేసులో దూళిపాళ్ల నరేంద్ర వరకూ జైలు జీవితం గడపాల్సి వచ్చింది కూడా. దీంతో ఆ తర్వాతి టార్గెట్ ఎవరు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రాష్ట్రంలో అమూల్ రంగ ప్రవేశం చేయడంతో సంగం డైరీపై కేసులతో హోరెత్తించారు. అదే విధంగా ఇప్పుడు మంగళగిరి ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి వంతు వచ్చింది. ఎన్ ఆర్ ఐ మెడికల్ కాలేజి అండ్ హాస్పిటల్ యాజమాన్యంలో విభేదాలు ఉన్నాయి.

ఆ విభేదాలు పోలీసు కేసుల వరకూ వెళ్లాయి. ఇప్పుడు ఈ కేసులపై పోలీసులు దృష్టి సారించారు. ఎన్ ఆర్ ఐ మెడికల్ కాలేజి చైర్మన్ నిమ్మగడ్డ ఉపేంద్ర తో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు విభేదాలు ఉన్నాయి.

దీనికి సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు దాఖలైంది. కోర్టులో వ్యాజ్యం కూడా నడుస్తున్నది. 2019లో రాజేంద్ర ప్రసాద్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో విధ్వంసం సృష్టించారనేది పోలీసు కేసు కాగా తాజాగా పోలీసులు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో తనిఖీలు చేయడంతో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే చర్చ ప్రారంభం అయింది.

మెడికల్ కాలేజీ భాగస్వాముల వ్యవహారంలో పోలీసు కేసులు దాఖలు కావడం, ఇప్పుడు పోలీసులు తనిఖీలు చేపట్టడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోలీసులు ఏ క్షణాన అయినా ఆలపాటి రాజాను అరెస్టు చేసేందుకు అవకాశం ఉందని తెలుగుదేశం నేతలు ఆందోళన చెందుతున్నారు.

అముల్ కంపెనీ ప్రవేశం తర్వాత సంగం డైరీపై కేసులు నమోదు అయినట్లు ఇప్పుడు ఒక బడా వ్యాపారవేత్త కు మెడికల్ కాలేజీని కైవసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని  కూడా ఆరోపిస్తున్నారు. పోలీసు కేసులో తెలుగుదేశం పార్టీ నాయకుడిని అరెస్టు చేయడంతో బాటు మెడికల్ కాలేజీని తమకు అనుకూలురైన వారికి కట్టబెట్టడం వల్ల రెండు కోరికలు నెరవేరతాయని కొందరు ప్లాన్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోలీసులు కేసు వరకూ పరిమితం కాకుండా అక్రమంగా అకౌంట్స్ చెక్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని కూడా చెబుతున్నారు. ఎన్ ఆర్ ఐ మెడికల్ కాలేజీ ఒక రకంగా చూస్తూ బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిది.

ఎంబిబిఎస్ సీట్లలో యాజమాన్య కోటా నుంచి ప్రతి ఏటా వందల కోట్లలో ఆదాయం ఉంటుంది. ఇలాంటి బంగారు బాతు దొరికితే వదిలిపెడతారా?

Related posts

వై నాట్ 175కు టీడీపీ కౌంటర్: పులివెందుల నుంచి డాక్టర్ సునీత?

Satyam NEWS

బ్లాక్ లిస్ట్:వెస్ట్‌ బ్యాంక్‌లో 112 కంపెనీలపై నిషేధం

Satyam NEWS

రాష్ట్ర విజిలెన్స్ నివేదిక ఆధారంగానే దాడులు

Murali Krishna

Leave a Comment