38.2 C
Hyderabad
April 29, 2024 14: 46 PM
Slider ప్రత్యేకం

రేపు ఏరువాక పౌర్ణమి: ఏరువాక సాగారో.. నీ కష్టమంతా తీరునురో

#eruvaka pournami

భారతీయ సనాతన ‌సంస్కృతి, జీవన విధానానికి వెన్నుముక వ్యవసాయం. వ్యవసాయం అంటే ఒక మహా యజ్ఞం.దీనికి ప్రధాన పనిముట్టు నాగలి,ముఖ్యమైన వనరు వర్షం.వర్షం కురిసే కాలం సమయంలో రైతులు కృతజ్ఞతతో, వేడుకగా జరుపుకునే ముఖ్యమైన పండుగ ‘కృషి పూర్ణిమ’.దీనినే ‘హల పూర్ణిమ’అని,’ఏరువాక పున్నమి’ అనే పేరుతో పిలుస్తారు.

‘ఏరు’ అంటే నాగలి

ఈ పండుగలో ‘ఏరు’ అంటే నాగలి అని, ‘ఏరువాక’అంటే దుక్కి (వ్యవసాయ భూమి)దున్నటం ప్రారంభం అనే అర్థాలు ఉన్నాయి. వ్యవసాయానికి కావలసిన వర్షం కురిపిస్తాడని భావించే దేవేంద్రుణ్ని పూజించడం,నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలు పెట్టడం జ్యేష్ఠ పూర్ణిమ పర్వదిన ముఖ్య ఉద్దేశ్యము.

రైతులు ఈ పండుగ జరపడానికి గల కారణాన్ని ఒకసారి పరిశీలిస్తే  నాగలి సారించి పనులు ప్రారంభించడానికి జ్యేష్ఠ నక్షత్రం అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఈ నక్షత్రంతో చంద్రుడు తో కూడి ఉండే రోజు ‘జ్యేష్ఠ పూర్ణిమ’. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు అంటే(మంచు,ఎరువు , సూక్ష్మ ధాతువులు)పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్ని ఇస్తుందని అంటారు. పై కారణాల వల్ల జ్యేష్ఠ పూర్ణిమ రోజున భూమాతను పూజించి ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొంటారు.

వ్యవసాయానికి ఆలంబన పశుసంపద

వ్యవసాయానికి ఆలంబన అయిన పశుసంపద,భూమి, వ్యవసాయ పనిముట్లకు ప్రాధాన్యం ఇచ్చి పూజించడం ఈ పూర్ణిమ యొక్క ప్రత్యేకత. నాగళ్ళను శుభ్రపరచి,పసుపు,కుంకుమలతో అందంగా అలంకరించి పూజిస్తారు.అలాగే పశువులను కూడా అలంకరించి, వ్యవసాయ భూమికి పూజ నిర్వహిస్తారు.

ఆడపడుచులు పుట్టింటికి వచ్చి పశువుల కొట్టాలను,శుభ్రంచేసి రంగవల్లులతో అలంకరిస్తారు.అటు పిదప పొంగలిని (కొన్ని ప్రాంతాల్లో పులగం అంటారు)వండి వర్షానికి అధిదేవత అయిన దేవేంద్రుణ్ని పూజించి నివేదన చేస్తారు. ఆ తరవాత నివేదిత పదార్థాలను ఆవులకు,ఎద్దుకు తినిపిస్తారు.నాగళ్ళను పూజించి, పశువులను అలంకరించి, బండ్లకు కట్టి మేళ తాళాలతో ఊరంతా ఊరేగించి వ్యవసాయ భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభించటానికి బయలుదేరుతారు.

కొన్ని ప్రాంతాల్లో తొలి దుక్కిలో రైతులు కూడా ఎద్దుతో సమానంగా కాడికి రెండోవైపు నిలిచి భూమిని దున్నుతారు. ఎరువుగా మారిన పశువుల పేడను పొలాలకు తరలించే ప్రక్రియ కూడా ఈ పూర్ణిమ రోజున ప్రారంభిస్తారు.

సంస్కృతంలో ఈ పండుగను ‘ఉద్వృషభ యజ్ఞం’ అని పిలుస్తారు.వృషభం అంటే ఎద్దు.ఉద్ధృతం అంటే లేపడం అని అర్థం.విష్ణుపురాణంలో ఏరువాకను సీతాయజ్ఞం గా పేర్కొన్నారు.వేసవికాలం వల్ల కాస్తంత విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం సిద్ధపరచడం అని అర్థం.

ఋగ్వేదంలో కూడా వ్యవసాయ పనుల ప్రారంభం రోజున చేసే గౌరవ సూచక మైన ఉత్సవ ప్రసక్తి ఉంది.అధర్వణ వేదంలో కూడా ‘అనడుత్సవం అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది.దీనిలో భాగంగా హలకర్మ (నాగలి పూజ)’మేదినీ ఉత్సవం'(భూమి పూజ),వృషభ సౌభాగ్యం (పశువులకు చేసే పూజ)మొదలైన ప్రక్రియలు చేయాలని చెబుతున్నాయి.

ఇవే కాకుండా అనేక పురాణాలలోను ‘కృషి పూర్ణిమ’ ప్రసక్తి ఉంది. వరాహమిహిరుడు రచించిన ‘బృహత్సంహిత’ లో  పరాశరుడు రాసిన ‘కృషి పరాశరం’ లో కూడా ఈ ఉత్సవ ప్రసక్తి ఉంది.కర్ణాటక ప్రాంతంలోని వారు ‘కారణిపబ్బం’ అని ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు.

నిజానికి ఈ ఏరువాక పూర్ణిమ రైతుల పండగే అయినా రైతు అందరి ఆకలి తీరుస్తున్నాడు కనుక ఇది అందరి పండుగ

బాచిమంచి చంద్రశేఖర్, సత్యం న్యూస్

Related posts

విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పెంపొందించాలి

Satyam NEWS

చీరాల కరోనా రోగులకు కరణం వెంకటేష్ భరోసా

Satyam NEWS

సిరిమానోత్సవం: 60 సిసి కెమారాల‌తో విజయనగరం పోలీస్ బందోబ‌స్తు

Satyam NEWS

Leave a Comment