28.7 C
Hyderabad
May 6, 2024 00: 53 AM
Slider మహబూబ్ నగర్

సుధారాణికి అండగా కదలుతున్న మహిళామణులు

#Sudharani

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గాదెల సుధారాణి  రత్న ప్రభాకర్ రెడ్డి రాజీనామా సంచలనం సృష్టించబోతున్నది. వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేస్తున్నట్లు సుధారాణి చెప్పినా లోపల బలమైన కారణాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు.

ఎంతో మంచి పేరు, అందరితో కలుపుగోలుగా ఉంటాడని పేరు ఉన్న దివంగత నాయకుడు రత్న ప్రభాకర్ రెడ్డి సతీమణిగా అందరికి పరిచయం ఉన్న సుధారాణి అకస్మాత్తుగా పదవి నుంచి తప్పుకోవడానికి బలమైన రాజకీయ కారణం ఉండి ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

ఈ కారణంగానే కొల్లాపూర్ నియోజవర్గం ప్రాంతంలోని మహిళా ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తు ఉద్యమానికి సన్నద్ధం కాబోతున్నారని సమాచారం. ఒక మహిళామణికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి సాటి  మహిళామణులు, ప్రజా ప్రతినిధులు ఏకమయ్యారని అని తెలుస్తుంది.

ఇకపోతే ఎంపీపీ పదవికి రాజీనామా చేసిన సుధారాణి రాజకీయంగా పూర్తి అశ్రద్ధకు గురయ్యారని ఇలాంటి పరిస్థితులు మరెవరికి  రాకూడదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని కోడేర్, చిన్నంబావి, పెంట్లవెల్లి మండలాల ప్రాంతాల నుండి మహిళామణులు ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

 అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం చేయబోతున్నట్లు సమాచారం. ఇది  రాజకీయ కోణంలో కొందరు చూసినా కానీ మహిళలలో చైతన్యం వచ్చిందంటే అందరూ  సంతోషించాల్సిన విషయమే. ఈ ఉద్యమ పరిస్థితులు ఎంత దూరం పోతాయో చూడాలి. మరో సారి కొల్లాపూర్ పేరు రాష్ట్ర స్థాయిలో మారుమోగనున్నది.

Related posts

కబ్జాకు పాల్పడుతున్న బీఆర్ఎస్ కార్పొరేటర్

Satyam NEWS

ఇండోనేషియాతో భారత్ కు బలమైన బంధం ఉంది

Bhavani

కె రామకృష్ణ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్

Bhavani

Leave a Comment