28.7 C
Hyderabad
May 6, 2024 00: 08 AM
Slider నల్గొండ

మహిళలు నిర్ణయాధికారులుగా ఎదగాలి

#hujurnagarMRO

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక తహశీల్దార్ వజ్రాల జయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసిల్దార్ జయశ్రీ ని కళాశాల అధ్యాపకులు,సిబ్బంది, విద్యార్ధినీ విద్యార్ధులు ఘనంగా సన్మానించారు. అనంతరం జయశ్రీ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు నిర్ణయాధికార శక్తులుగా ఎదినప్పుడే సామాజిక పురోగతి సాధించినవారమౌతామని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ భీమార్జునరెడ్డి మాట్లాడుతూ విద్యార్థినీలు అత్యున్నత పదవులను అలంకరించటం ద్వారా మహిళా సాధికారత సాధించినవారౌతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల మహిళా ఉద్యోగులు ఎ.మాలతి,వి.రాధా, ఎన్.స్రవంతి,అధ్యాపకులు,కళాశాల సిబ్బంది,ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమ నిర్వాహకులు ఎస్.శ్రీనివాసరావు,డాక్టర్ డి.నగేష్ డాక్టర్ చందా అప్పారావు, జి.సైదులు, బి.సైదిరెడ్డి,పి.నాగరాజు,నాగార్జున,వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ,రవికుమార్, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

శాడ్: పాపం భగవాన్ రెడ్డి ..జర్నలిస్ట్ గా

Satyam NEWS

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇక మహర్దశ

Satyam NEWS

కేరళ గవర్నర్ ఛాలెంజ్: వీసీ నియామకాల్లో నా జోక్యం లేదు

Bhavani

Leave a Comment