31.7 C
Hyderabad
May 2, 2024 09: 25 AM
Slider వరంగల్

బెస్ట్ సోషల్ సర్వీసర్ గా డా.కె.అనితారెడ్డి ఎంపిక

#anurag

మహిళ దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని సాయిబాబా దేవాలయం వారు వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందించారు. వారు నిర్వహించిన పోటీ లో బెస్ట్ సోషల్ సర్వీసర్ గా అనురాగ్ హెల్పింగ్ సోసైటి ప్రెసిడెంట్ డా.కె అనిత రెడ్డి ఎంపిక అయ్యారు. అనిత రెడ్డి అనాధలు, దివ్యాంగులు, వృద్ధులకు, మహిళలకు సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి  అవార్డును అందించి, ఘనంగా సత్కరించారు.

అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అతిథుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న అనిత రెడ్డి మాట్లాడుతూ అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు. ఇక ముందు మరిన్ని సేవలను అందిస్తానని అన్నారు. ఈ సంవత్సరం ఈ అవార్డుతో పాటు స్త్రీ శిశు, సంక్షేమం వారు రెడ్ క్రాస్ హన్మకొండ వారు కూడా బెస్ట్ సోషల్ సర్వీసర్ గా అవార్డును అందించారని చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆలయ ధర్మకర్తలు మెంబర్స్ ఎ.జె.సి. సంధ్య రాణి గారు D.W.O సబిత కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : అల్లం నారాయణ

Satyam NEWS

పేద ప్రజల నడ్డివిరిచిన జగన్ రెడ్డి పాలన

Bhavani

రాజ్యాంగాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment