28.7 C
Hyderabad
May 6, 2024 10: 39 AM
Slider విజయనగరం

ప్ర‌తీ మ‌హిళ‌లోనూ అమ్మ‌ను చూడ‌గ‌లిగిన‌ప్పుడే సంపూర్ణ సంస్కారం

#VijayanagaramPolice

ఈ మాట‌లు అన్న‌ది ఏ ర‌చ‌య‌తో ఏ క‌వో…లేక‌ ఏ గాయ‌కుడో అన్న‌లేదు….ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పోలీస్ సూప‌రెంటెండెంట్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న బీ.రాజ‌కుమారీ అన్న మాట‌ల‌వి. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా  రెండు పాటు మ‌హిళ‌ల‌కు వంద‌నం  అన్న  పేరుతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది.

అందులో భాగంగా  అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా ఒక్క రోజు ముందుగానే మ‌హిళ‌ల‌ను మేల్కోలిపే విధంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ శాఖ మ‌హిళా పోలీసులు, వారి కుటుంబంలో ఉన్న మ‌హిళ‌ల‌కు ఉచితంగా వైద్య స‌దుపాయం  క‌ల్పించే ఏర్పాటు  చేసారు..జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ.

మ‌హిళ‌లు అంటే వంటింటి కుందేలు కాద‌ని…చేతితో గ‌రిటె తిప్ప‌గ‌ల‌రు…అదే చేత్తో వెప‌న్ ను వాడ‌గ‌ల‌ర‌ని…పిల్ల‌ల ఆల‌నా,పాలనా చూడ‌గ‌ల‌రు….పోకిరీ  ప‌నుల ఆట క‌ట్టించ‌గ‌ల‌రు…అలాగే  ప‌రిపూర్ణంగా ఓ మ‌హిళ స‌మాజాన్నే మార్చేయ‌గ‌ల శ‌క్తి ఉంద‌ని…ఎస్పీ రాజ‌కుమారీ అన్నారు.

మహిళా దినోత్స‌వం సంద‌ర్బంగా మ‌హిళకు వంద‌నం అన్న పేరుతో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌లో భాగంగా కంటోన్మెంట్ పోలీస్ బ్యారెక్స్ వ‌ద్ద ఉన్న పోలీస్ శాఖ ఆధీనంలో న‌డ‌ప‌బ‌డుతున్న శార్వాణీ పాఠ‌శాల‌లో  కొన్ని దీర్ఘ‌కాలిన జ‌బ్బుల‌కు సంబంధించి ఉచితంగా వైద్య శిబిరం నిర్వ‌హించింది..జిల్లా పోలీస్ శాఖ‌.

ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఎస్సీ మాట్లాడుతూ…..తాను ఉద‌యాన్నే మార్కింగ్ వాక్ చేస్తుండ‌గా..”ప్ర‌తీ మ‌హిళ‌లోనూ పురుషుడు అమ్మ‌ను చూడ‌గ‌లిగిన‌ప్పుడే ప్ర‌తీ అతివ అందలం ఎక్కుతుంది..అని స్పురించింద‌న్నారు.

ప్ర‌దానంగా ప్ర‌స్తుత స‌మాజంలో మ‌హిళ‌లే అన్ని రంగాల‌లో రాణిస్తున్నార‌ని…మ‌గాడితో స‌మానంగా అన్నింటిలోనూ ప్ర‌తీ అతివ ప్ర‌తిభ క‌నబ‌రుస్తున్నార‌న్నారు.అంతకు ముందు అడిష‌న‌ల్ ఎస్పీ ఆప‌రేష‌న్స్ సూర్య‌నారాయ‌ణ రాజు మాట్లాడుతూ నా ఇన్నేళ్ల స‌ర్వీసులో ఇంజ‌క్ష‌న్  అన్న‌ది తీసుకోలేద‌ని…కానీ ఈ  క‌రోనా విజృంభిస్తున్న ఈ  త‌రుణంలోనే ఎస్పీ మేడం సూచ‌న‌ల‌తో తొలిసారిగా క‌రోనా వ్యాక్సినేష‌న్ ద్వారా ఇంజ‌క్ష‌న్ తీసుకున్నాన‌న్నారు.

అలాగే తిరుమ‌ల హాస్ప‌ట‌ల్స్  స‌హాకారంతో పోలీస్ శాఖ ఉచిత వైద్య స‌దుపాయాలు కొన్నిజ‌బ్బుల‌కు ప‌రీక్షలు…మ‌హిళా సిబ్బింది చేయించుకునే విధంగా  ఏర్పాటు చేసారు. ఈ సంద‌ర్బంగా తొలి మ‌హిళా అదీ మ‌హిళా ఎస్పీగా రాజ‌కుమారీకి…తిరుమ‌ల హాస్ప‌ట‌ల్స్ అధినేత డా.తిరుమ‌ల ప్రసాద్…బీసీ చెక్ చేసారు. ఈ  కార్య‌క్ర‌మంలో ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు,ఎస్.బీ సీఐలు,శ్రీనివాస‌రావు,రాంబాబు, న‌గ‌ర సీఐలు ముర‌ళీ,శ్రీనివాస‌రావు, మ‌హిళా సీఐ మంగ‌వేణి,ఎస్ఐలు లీలావ‌తి,దేవీ ఉన్నారు.

మ‌హిళా దినోత్స‌వం రోజున‌….విక‌లాంగ ఎంఎస్పీ రాక‌…!

అంతర్జాతీయ మ‌హిళాదినోత్స‌వం సంద‌ర్బంగా పోలీసు సంక్షేమ పాఠ‌శాల‌లో మ‌హిళ‌ల‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం సందర్భంగా ఎస్పీ మాట్లాడుతున్న స‌మయంలోనే ఓ విక‌లాంగ మ‌హిళా సంర‌క్ష‌క పోలీసు ను ఆమె బంధువు ఒక్క‌రు స్కూటర్ మీద తీసుకు వ‌స్తుండ‌గా మీడియా కంట ప‌డింది. రెండు కాళ్లు లేని ఆమె…కృత్రిమ కాళ్ల‌తో స‌భా స్థ‌లికి వ‌స్తున్న దృశ్యాన్ని చూసి అక్క‌డున్న వారంతా నిశ్చేష్టులైనారు. అదే స‌మ‌యంలో మాట్లాడుతున్న ఎస్పీ ఉన్న ప‌ళంగా త‌న ప్ర‌సంగాన్ని నిలుపుదల చేసారు. ఆ  స‌మ‌యంలోనే…వ‌న్ టౌన్ ఎస్ఐ  దేవీ అక‌స్మాత్తుగా లేచి…ఆమెకు ద‌గ్గ‌రుండీ స‌భా స్థ‌లికి తీసుకుని వ‌చ్చి ప్ర‌త్యేకించి  కూర్చీ వేయించి కూర్చొ పెట్టిన త‌ర్వాతే ఎస్పీ త‌న  ప్ర‌సంగాన్ని తిరిగి మొద‌లు పెట్టారు.

ఎం. భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

పాలకుర్తి-వల్మీడి-సన్నూరు టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ కావాలి

Bhavani

తెలంగాణలో క‌రోనా 596 కేసులు, 3 మరణాలు

Sub Editor

హుజూర్ నగర్ లో నేత్రపర్వంగా శ్రీరామ కళ్యాణ వేడుక

Bhavani

Leave a Comment