39.2 C
Hyderabad
May 3, 2024 14: 27 PM
Slider విజయనగరం

మహిళా దినోత్సవం సందర్భంగా “రన్ ఫర్ వుమెన్ సేఫ్టీ”

#VijayanagaramSP

ఈ నెల 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆ రోజున అదీ మహిళా పోలీసు కోసం… ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని డీజీపీ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు సమాయాత్తమవుతున్నారు.

అందులో భాగంగా విజయనగరం జిల్లా లో లేడీ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజకుమారీ… ఈ మేరకు పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రత్యేకించి అదే  రోజున ‘రన్ ఫర్ ఉమెన్ సేఫ్టీ’ అన్న కార్యక్రమం నిర్వహించి అందులో గెలుపొందిన విజేతలకు 2వేల నుంచీ 5వేల వరకు నగదు భహుమతి ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా అదే రోజు న నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సిబ్బంది యో చర్చించారు.విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా “మహిళకు వందనం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి పోలీసుఅధికారులతో సమీక్షించేందుకుగాను జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ – మహిళలు ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లిగా, భార్యగా, చెల్లిగా, గృహిణిగా, ఉద్యోగినిగా విభిన్నమైన పాత్రలను పోషిస్తూ, కుటుంబ బాధ్యతలను, ఇంటి బాధ్యతలను, ఉద్యోగ బాధ్యతలనుసమర్ధవంతంగా నిర్వహిస్తు, వారి కుటుంబాలను ఉన్నతంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని, అటువంటి మహిళలను ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

కావున, మహిళా దినోత్సవం రోజున మహిళలు ఎక్కడ కనబడినా వారిని గౌరవించాలని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పిలుపునిచ్చారు. మహిళలను గౌరవించడం వలన మన ఇంటిలో తల్లిని, చెల్లిని, అక్కను గౌరవించినట్లే అవుతుందన్నారు.

పోలీసుశాఖలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు, వారి కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు తిరుమల నర్సింగ్ హోమ్ సహకారంతో మార్చి 7న శార్వాణి పోలీసు సంక్షేమ పాఠశాల్లో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

ఫిజీషియన్ గైనక శిబిరంలో పాల్గొని, ఇక శాఖలో సమర్ధవంతంగా పని చేస్తూ ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్న మహిళా పోలీసు ఉద్యోగులను “మహిళకు వందనం” పేరుతో మార్చి 7, సాయంత్రం 4 గంటలకు పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించే కార్యక్రమంలో సన్మానిస్తున్నామన్నారు.

కరాటేలో శిక్షణ పొందిన మహిళా పోలీసులతో “ధీర” ప్రదర్శన ఇస్తున్నామన్నారు. మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన వార్ని, మహిళలపై దాడులకు పాల్పడే వారి నుండి రక్షణ ఏవిధంగా పొందాలన్న విషయమై ఈ ప్రదర్శన ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ర్యాలీని మార్చి 7, సాయంత్రం 6 గంటలకు బాలాజీ జంక్షను నుండి మూడు లాంతర్ల వరకు నిర్వహించనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నందుకు, వారు సాధిస్తున్న విజయాలకు సూచికగా ర్యాలీని నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ర్యాలీలో అన్ని వర్గాలకు చెందిన మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చునన్నారు.

ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆసక్తి కలిగిన మహిళలకు 3 కి||మీ||ల పింక్ థాన్ పరుగును “రన్ ఫర్ ఉమెన్ సేఫ్టీ” పేరుతో నిర్వహిస్తున్నామ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ పరుగును మార్చి 8, ఉదయం 6 గంటలకు మయూరి జంక్షను నుండి రైల్వే స్టేషను, సిఎంఆర్, గూడ్సు షెడ్, బాలాజీ టెక్స్ టైల్స్, గణేష్ టెంపుల్, కలెక్టరాఫీసు, జిల్లా పోలీసు కార్యాలయం మీదుగా దిశ పోలీసు స్టేషను వద్ద ముగుస్తుందన్నారు.

ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన మహిళలు, మహిళా క్రీడాకారిణులు మార్చి 8, ఉదయం 6గంటల కు మయూరి జంక్షను వద్ద హాజరుకావాలని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని, విజయవంతం చేయాల్సిందిగా ఎస్పీ కోరారు.

ఈ కార్యక్రమంలో దిశా డిఎస్పీ టి.త్రినాథ్, విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్. మోహనరావు, ఎ ఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, సిఐలు, ఆర్ ఐలు, ఏసైలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎం. భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

మెగా ఫ్యాన్స్ కి ఇక పూనకాలే

Satyam NEWS

పోలీసుల నైతికతను దెబ్బతీసే ఈనాడు కథనం

Satyam NEWS

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి రెండో నోటీసు

Bhavani

Leave a Comment