28.7 C
Hyderabad
May 5, 2024 10: 32 AM
Slider ఖమ్మం

భరోసా కోసం ఉమెన్స్ హెల్ప్ డెస్క్

#dcp

మహిళలకు భరోసా కల్పించేందుకు ఉమెన్స్ హెల్ప్ డెస్క్ మరింత దోహదపడుతుందని అడిషనల్ డీసీపీ డా.శభరిష్ తెలిపారు. మహిళలు, చిన్నారులు తమ సమస్యలను చెప్పుకునేందుకు  మరింత స్వేచ్చగా పోలీస్ స్టేషన్లకు చేరుకోగలిగేలా చేయడంపై దృష్టి పెట్టిన పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, రిసెప్షనిస్ట్లులకు ఉమెన్ హెల్ప్ డెస్క్ విధులపై రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని అడిషనల్ డీసీపీ  ప్రారంభించారు. ఖమ్మం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ళో జరిగిన ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాధిత మహిళలను గౌరవంగా సంబోధించే వాతావరణం కల్పిస్తూ తమ సమస్యను నిర్భయంగా చెప్పుకునేలా, న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రతకు తెలంగాణ పోలీస్ శాఖ ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పోలీసులంటే అపోహలు పోగొట్టి ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో మహిళ సిబ్బందితో కూడిన మహిళా హెల్ప్‌ డెస్క్‌ల ద్వారా బాధిత మహిళల పట్ల సున్నితంగా ఉండటానికి, స్నేహపూర్వకంగా ఎలా వ్యవహరించాలో సిబ్బందికి శిక్షణలో  తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , అడిషనల్ ఎస్పీ ఉమెన్ సేఫ్టీ వింగ్ రామ్ కుమార్ , సీసీఆర్బీ ఏసీపీ వెంకటస్వామి ,సిఐ సాంబరాజు, సిఐ నరేష్ బాబు పాల్గొన్నారు.

Related posts

హరీష్, హుజూరాబాద్ సరే పరిగిని అభివృద్ధి చేశారా?

Satyam NEWS

ఫేస్ బుక్ తో పరిచయంతో బ్యాంకు ఖాతా కొల్లగొట్టిన లేడీ కిలాడీ

Satyam NEWS

బాపునగర్ లో ఆషాకిరణ్ సెంటర్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment