29.7 C
Hyderabad
May 4, 2024 05: 26 AM
Slider ఖమ్మం

104 పాఠశాలల్లో పనులు పూర్తి

#collector

ఖమ్మం జిల్లాలో మొదటి విడతగా మన వూరు మన బడి కింద  426 పాఠశాలలను ఎంపిక చేసి, పనులు చేపట్టినట్లు జిల్లా కలక్టర్ గౌతమ్  తెలిపారు. విద్యాశాఖ ద్వారా చేపట్టిన పనులు 104 పాఠశాలల్లో పూర్తికాగా, 322 పాఠశాలల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. 12 పాఠశాలలు పనులు పూర్తిచేసుకుని పునః ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు. ఉపాధి హామీ క్రింద 66 పాఠశాలల్లో పనులు పూర్తి కాగా, 306 పాఠశాలల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు. మార్చి నెలాఖరు కల్లా 50 శాతం పాఠశాలల పనులు పూర్తిచేయాలని, మిగులు పాఠశాలల పనులు విద్యా సంవత్సరం ప్రారంభం లోగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ప్రతిపాదనలు ఇంకనూ పెండింగులో ఉంటే వెంటనే సమర్పించాలన్నారు. ఉపాధి హామీ నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పెయింటింగ్, డ్యూయల్ డెస్క్ ల సరఫరా జాప్యం కాకుండా చూడాలన్నారు. ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు, ఎన్ఆర్ఐ లను పాఠశాలల అభివృద్ధికి చేయుతకు కోరనున్నట్లు ఆయన అన్నారు.

విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తయి, విద్యార్థులు ఉత్సాహంగా, క్రొత్త వాతావరణంలో మంచిగా విద్యను అభ్యసిస్తారని కలెక్టర్ తెలిపారు.  ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, డిఆర్డీఓ విద్యాచందన, ఇఇలు నాగశేషు, కెవికె. శ్రీనివాస్, చంద్రమౌళి, శ్యామ్ ప్రసాద్, ఎంఐఎస్ రామకృష్ణ, వ్ఎంఇఓ లు, వివిధ ఇంజనీరింగ్ శాఖల డిఇలు, ఎఇలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ శివారులో భారీగా నకిలీ మద్యం

Bhavani

నిజామాబాద్ చౌరాస్తాలో చెప్పుతో కొడతా

Satyam NEWS

ఉన్న పళంగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. ..

Satyam NEWS

Leave a Comment