37.2 C
Hyderabad
April 26, 2024 20: 51 PM
Slider పశ్చిమగోదావరి

జగనన్న లేఔట్ లబ్దిదారులకు బంపర్ ఆఫర్

#jaganannalayout

ఏలూరు జిల్లా పెదవేగి మండలం జానంపేట గ్రామంలో జగనన్న లే ఔట్ లో ఇల్లు నిర్మించుకునే లబ్ది దారులకు పెదవేగి మండల తహసీల్దార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులతోగృహ నిర్మాణాలు ప్రారంభించలేని లబ్దిదారులకు డ్వాక్రా గ్రూపు ద్వారా పునాదులు వేసుకోవడానికి  48 గంటల్లో 35 వేల రూపాయలు తక్షణ రుణం అందిస్తామని చెప్పారు. శుక్రవారం పెదవేగి మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్ వి నాగమణి తో ఆధ్వర్యం లో తహసీల్దార్ ఎన్ నాగరాజు.ఎం పి డి ఓ జి రాజ్ మనోజ్ ల నేతృత్వంలో జనం పేటలో సర్వే నంబర్ 249/2లో ఇచ్చిన ఇళ్ల స్థలాల లే ఔట్ లో లబ్ది దారులతో గృహ నిర్మాణాలు పై సమీక్షించారు.

గృహ నిర్మాణాలు ప్రభుత్వం ప్రతి లబ్దిదారునికి 1లక్షా 80 వేల రూపాయలు అందిస్తుందని  తహసీల్దార్ లబ్ది దారులకు వివరించారు. అవికాక పునాది నిర్మాణానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే లబ్ది దారులకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ద్వారా ముందస్తు పెట్టు బడిగా 35 వేల రూపాయల రుణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ రుణ సౌకర్యాన్ని లబ్ది దారులు సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణ పునాదులు వేసుకోవాలని కోరారు.

మూడో ఆప్షన్ గా గృహాలు నిర్మించుకోలేని లబ్ది దారులకు కాంట్రాక్టర్ ల ద్వారా గృహాలు నిర్మిస్తామని తహసీల్దార్ లబ్ధిదారులకు తెలిపారు. ప్రతి గృహనికి విద్యుత్ సర్వీస్ తో బాటు మంచినీటి కుళాయి పంపు ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఏ ఈ కె నాగరాజు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ ట్రాన్స్కో ఏ ఈ  సచివాలయ సిబ్బంది, గృహనిర్మాణ లబ్ది దారులు పాల్గొన్నారు.

Related posts

పేద  ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం భరోసా

Satyam NEWS

సమగ్ర శిక్ష ఉద్యోగుల భిక్షాటన

Satyam NEWS

దక్షిణాది రాష్ట్రాలలో ఎటాక్ జరగవచ్చు జాగ్రత్త

Satyam NEWS

Leave a Comment