29.7 C
Hyderabad
May 2, 2024 04: 42 AM
Slider రంగారెడ్డి

హైదరాబాద్ శివారులో భారీగా నకిలీ మద్యం

#liquor dump

హైదరాబాద్ శివారు ప్రాంతాలైన పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, దేవల్లమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం డంప్‌ను ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం అమ్ముతున్నట్లు హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు సమాచారం అందుకున్నారు. వెంటనే ఓ బృందం హయత్‌ నగర్, పెద్ద అంబర్ పేట్ సహా పలు ప్రాంతాల్లోని బెల్ట్ షాపుల్లో తనిఖీలు చేశారు.

సాధారణ మద్యం కొనుగోలుదారుల్లా బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసిన ఎక్సైజ్ పోలీసులు అవి నకిలీవిగా గుర్తించారు. బెల్ట్ షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ మద్యం డంప్ గుట్టు రట్టైంది. అతనిచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, దేవలమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం డంప్‌ని గుర్తించారు. ఆ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ డంప్ అంతా దేవలమ్మ నాగారానికి చెందిన ఓ బడా మద్యం వ్యాపారికి చెందినదిగా గుర్తించారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్టు

Satyam NEWS

గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై బాలికలకు అవగాహన

Satyam NEWS

అంబర్ పేట చే నంబర్ వద్ద ఒక వైపు రాకపోకలను అనుమతించాలి

Bhavani

Leave a Comment