28.7 C
Hyderabad
May 6, 2024 02: 26 AM
Slider మహబూబ్ నగర్

మైనార్టీ గురుకుల కళాశాలల జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి 23న రాత పరీక్ష

#minarity welfare

నాగర్ కర్నూల్ జిల్లా లోని నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ పట్టణాల్లో కొనసాగుతున్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 23 జూనియర్ లెక్చరర్ల పోస్టుల అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ కోసం నమోదు చేసుకున్న 162 మంది అభ్యర్థులకు ఆగస్టు 23వ తేదీ సోమవారం నాడు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అచ్చంపేట మైనార్టీ గురుకుల పాఠశాలలో 65 మంది అభ్యర్థులు, నాగర్ కర్నూల్ మైనార్టీ గురుకుల పాఠశాలలో 97 మంది అభ్యర్థుల చొప్పున పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించే రాత పరీక్షకు అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఆధార్, ఒక పాస్ పోర్ట్ ఫోటోతో పరీక్షా కేంద్రానికి హాజరుకావాలన్నారు.

కరోనా నియమనిబంధనల మేరకు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యర్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి పరీక్షలకు హాజరు కావాలన్నారు. డిఎల్సిఓ హవీలా రాణి, విజిలెన్స్ అధికారి జమీర్ ఖాన్ ల పర్యవేక్షణలో జూనియర్ లెక్చరర్ల రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Related posts

విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ హత్య

Satyam NEWS

చలో రాజ్ భవన్ కు కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులు

Satyam NEWS

మళ్లీ ట్విట్టర్ లోకి వచ్చిన డోనాల్డ్ ట్రంప్

Satyam NEWS

Leave a Comment