39.2 C
Hyderabad
May 3, 2024 14: 59 PM
Slider వరంగల్

నకిలీ డాక్యుమెంట్లతో కెనరా బ్యాంకుకు 3.87 కోట్ల టోకరా

#canarabank

హన్మకొండ జిల్లాలో భారీ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హనుమకొండ నక్కలగుట్టలోని కెనరా బ్యాంకు (సిండికేట్ బ్యాంకు) లో కొందరు నకిలీ డాక్యుమెంట్లతో సుమారు రూ .3.87 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. నిందితులపై బ్యాంకు చీఫ్ మేనేజర్ బి.ఇ.ఫణికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సుబేదారి సీఐ రాఘవేందర్ తెలిపారు.

సీఐ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది వ్యాపార, ఇంటి నిర్మాణాలతోపాటు వివిధ యూనిట్లు నెలకొల్పుతున్నామని నక్కలగుట్ట బ్రాంచ్ లో రుణాలు పొందారు. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది ఉండటంతో అనుమానం వచ్చిన బ్యాంకు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా నకిలీ డాక్యుమెంట్ల బాగోతం బయటపడింది. తప్పుడు పత్రాలతో రుణాలు పొంది, ప్రభుత్వ రాయితీ సొమ్మును కూడా వాడుకున్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు.

ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, 420, 406 , 464 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు సీఐ తెలిపారు. రుణాలు పొందిన వారు: సంగి యాదగిరి, వంశీ, వాంకుడోతు శ్రీనివాస్, ఖాజా ముజాహిల్ అబిదీన్, జన్ను శారద, సరిగొమ్ముల స్వరూ పారాణి, కె.రేణుక, సోమరాతి ప్రభాత్, సంగి అనిల్, చందా సులోచన, జెట్టి శ్వేత, గాదె అజిత్ కుమార్, కాసర్ల సంధ్యారాణి, జన్ను సార, బొడ్డు మౌనిక, సందీప్, బి.వి నోద్, మహ్మద్ జాఫర్‌ఖాన్, మహ్మద్ ఇలియాస్, మహ్మద్ జానీమియా తదితరులు ఉన్నారు.

Related posts

సిగ్గులేని సినీ పెద్దలకు గడ్డిపెట్టిన నాగబాబు

Satyam NEWS

ఢిల్లీలో రికార్డు స్థాయిలో తాజాగా కరోనా కేసులు

Satyam NEWS

శివోహం: సోమశిలలో మార్మోగిన శివనామ స్మరణ

Satyam NEWS

Leave a Comment