38.2 C
Hyderabad
April 28, 2024 21: 05 PM
Slider ముఖ్యంశాలు

సొనాలికా ఆగ్రో సొల్యూషన్స్‌ ట్రాక్టర్‌, ఇంప్లిమెంట్స్‌ రెంటల్‌ యాప్‌ విడుదల

#sonalika

సాంకేతికత ఇప్పుడు అన్ని రంగాలకూ విస్తరిస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా ఈ సాంకేతికత తనదైన ప్రభావం చూపడం ప్రారంభించింది. భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ట్రాక్టర్‌ బ్రాండ్‌, భారతదేశంలో నెంబర్‌ 1 ఎగుమతి ట్రాక్టర్‌ బ్రాండ్‌గా వెలుగొందుతున్న సోనాలికా, ఇప్పుడు సాంకేతికత ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ, డిజిటలీకరణను వృద్ధి చేస్తామనే తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. సోనాలికా తమ నూతన ‘సోనాలికా అగ్రో సొల్యూషన్స్‌ ట్రాక్టర్‌, ఇంప్లిమెంట్స్‌ యాప్‌’ను విడుదల చేసింది.ఈ రెంటల్‌ యాప్‌ ద్వారా ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర సామాగ్రిని అద్దెకు అందించవచ్చు. తద్వారా రైతులు మరియు హైటెక్‌ వ్యవసాయ యంత్ర సామాగ్రి నడుమ ఉన్న అంతరాలను తగ్గించే ప్రయత్నం చేస్తుంది.

సోనాలికా అగ్రో సొల్యూషన్స్‌ ట్రాక్టర్‌ మరియు ఇంప్లిమెంట్‌ రెంటల్‌ యాప్‌ రైతులకు మద్దతునందించడంతో పాటుగా వ్యవసాయాన్ని ప్రభావవంతమైన రీతిలో చేసేందుకు తోడ్పడుతుంది. ఈ యాప్‌తో రైతులు ఉన్న ప్రాంతంలో నైపుణ్యం కలిగిన ఆపరేటర్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా అత్యుత్తమ జీవనోపాధి అవకాశాలను సైతం అందిస్తుంది. సోనాలికా ఆగ్రో సొల్యూషన్స్‌ యాప్‌తో రైతులు అదనంగా సంపాదించగలరు. తమ దగ్గర వ్యవసాయ పనిముట్లు కలిగిన రైతులు దీనిపై నమోదు చేసుకోవడం ద్వారా వాటిని అద్దెకు ఇచ్చి సంపాదించవచ్చు. ఈ యాప్‌ను గుగూల్‌ ప్లే స్టోర్‌ నుంచి అత్యంత సౌకర్యవంతంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రైతులకు నమోదు ప్రక్రియలో సహాయపడేందుకు టెలి కస్టమర్‌ మద్దతు సైతం అందుబాటులో ఉంటుంది.

ఈ నూతన వ్యాపార కార్యక్రమం గురించి రమణ్‌ మిట్టల్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సోనాలికా గ్రూప్‌ మాట్లాడుతూ ‘‘సాంకేతిక ఆవిష్కరణలకు సోనాలికా ట్రాక్టర్లు నేతృత్వం వహిస్తుండటంతో పాటుగా అందుబాటు మార్గంలో రైతులకు వాటిని చేరువ చేస్తుంది. వ్యవసాయ యాంత్రికీకరణను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడానికి సోనాలికా కట్టుబడి ఉంది. ఈ డిజిటలైజేషన్‌ యుగంలో మేము సోనాలికా ఆగ్రో సొల్యూషన్స్‌ యాప్‌ విడుదల చేశాం. మరీ ముఖ్యంగా ట్రాక్టర్‌; పనిముట్ల అద్దెకు ఇది తోడ్పడుతుంది. రైతు కేంద్రీకృత బ్రాండ్‌గా మమ్మల్ని నీతి ఆయోగ్‌ రైతు ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఆరంభించిన ప్రాజెక్ట్‌ కోసం ఎంపిక చేసింది’’ అని అన్నారు.

Related posts

రక్తదానంతో ప్రాణాలు నిలిపిన DSR ట్రస్ట్

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన ధర్నాను జయప్రదం చేయండి

Satyam NEWS

టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎన్నికల కమిషనర్

Satyam NEWS

Leave a Comment