40.2 C
Hyderabad
May 6, 2024 17: 43 PM
Slider కర్నూలు

అధికారులు వేధిస్తున్నారని వైసీపీ కార్పొరేటర్ ధర్నా

#kurnoolmunicipalcorporation

కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి అక్రమాలపై నగరపాలక సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించినందుకు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కర్నూలు 12వ వార్డు కార్పొరేటర్ అన్నే పోగు క్రాంతి కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చున్నాడు. వివరాల్లోకి వెళితే గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 52 కార్పొరేషన్ల గాను 41 స్థానాల్లో వైసీపీ ,9 టిడిపి, 2 స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు.

దీంతో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని వైసిపి దక్కించుకుంది. ఐతే 12వ వార్డులో కార్పొరేటర్ క్రాంతికుమార్ వైసీపీ తరఫున విజయం సాధించారు వైసీపీ తరఫున విజయం సాధించినప్పటికీ కార్పొరేషన్ లో జరిగే అవినీతి అక్రమాలను ఎండగడుతూ ప్రత్యేక కార్పొరేటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సర్వసభ్య సమావేశంలో కార్పొరేషన్ లో జరిగిన, జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడంతో అధికార పార్టీకి మింగుడు పడలేదు. 2009 వరదల్లో నాలుగు కోట్ల రూపాయల పైపులు మాయమయ్యాయని అలాగే అమృత్ స్కీం లో 8 కోట్ల అవినీతి జరిగిందని సర్వసభ్య సమావేశంలో మేయర్ ను అధికారులను ప్రశ్నించాడు.

దీంతో సమాధానం ఇచ్చుకోలేక అధికారులు నానాయాతలు పడ్డారు ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కార్పోరేషన్ లో అధికారులు, కమిషనర్, కర్నూలు ఎమ్మెల్యే తనపై వేధింపులకు గురి చేస్తున్నారని తనకు తెలియకుండా 12వ వార్డు సచివాలయంలో అడ్మిన్  సచివాలయ సిబ్బంది  బాగా పనిచేస్తున్నప్పటికీ బదిలీలు చేపట్టారని ఈ విషయాన్ని మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ నిస్సహాయతను వ్యక్తం చేయడమే కాకుండా ఎమ్మెల్యే  ప్రోద్బలంతోనే బదిలీ చేశామని చెబుతున్నారు బదిలీ చేసిన అడ్మిన్ ను సిబ్బంది బదిలీ  విరమించుకొనేంత వరకు నిరసనను కొనసాగిస్తానని తెలిపారు.

Related posts

మానేరు రివర్ ప్రంట్ టూరిజం పనులపై మంత్రి గంగుల సమీక్ష

Satyam NEWS

రాహుల్ కు వచ్చే ఎన్నికల్లో పోటీకి అర్హత ఉంటుందా?

Satyam NEWS

హిందువులపై దాడులను ఖండించిన తస్లీమా నస్రీన్

Sub Editor

Leave a Comment