28.7 C
Hyderabad
April 27, 2024 05: 06 AM
Slider మెదక్

ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్  పోటీలకు ఆహ్వానం

#medaksp

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే) పురస్కరించుకోని మెదక్ జిల్లా పరిధిలోని విధ్యార్థిని, విధ్యార్థులకు, యువతకు ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు  ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ కి  సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధ్వర్యంలో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహింబడుతోంది. ఈ పోటీలకు విద్యార్థులతో పాటు,యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఉత్సహంగా పాల్గొనాలని మెదక్ జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని పిలుపునిచ్చారు. ఈ పోటీలకు చివర తేది ఈ నెల 19వ తారీఖుగా నిర్ణయించగా అలాగే ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్(3 నిమిషాల నిడివి గల)  పోటీలకు సంబంధించి

రోడ్డు ప్రమాదాలు

సైబర్ నేరాలు

ఈవ్టీజింగ్, ర్యాగింగ్

కమ్యూనిటీ పోలీసింగ్

మూడనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు

అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన

ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ

ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలు

గత సంవత్సరం అనగా 2021 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు తీసిన మూడు ఫోటోలను షార్ట్ ఫిలిమ్(3 నిమిషాల నిడివి గల)  తమ పూర్తి వివరాలతో పెన్ డ్రైవ్ లో కానీ cd లో కానీ  ఈ నెల 19వ తారీఖులోపు మెదక్ జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలోని PRO సెక్షన్ నందు  ఇవ్వాల్సి వుంటుందని మెదక్ జిల్లా ఎస్.పి. తెలియజేసారు.

సమాజంలో శాంతి భద్రత పరిరక్షణ కోసం శ్రమించి తమ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలకు విధ్యార్థులతో పాటు, ఔత్సాహికులు పెద్ద సంఖ్య పాల్గొన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.

Related posts

డీఆర్ఓ స‌హ‌కారం లేనిదే క‌లెక్ట‌ర్ ముందు కెళ్ల‌లేరా..?

Satyam NEWS

గోవా ఎమ్మెల్యే ప్రసాద్ గాంకర్ రాజీనామా

Sub Editor

కొల్లాపూర్ చరిత్రకు తూట్లు పొడుస్తున్న స్వార్థపరుల ప్లాట్లు

Satyam NEWS

Leave a Comment