34.7 C
Hyderabad
May 5, 2024 00: 11 AM
Slider విజయనగరం

ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలి: టీడీపీ డిమాండ్

#protest

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ను తక్షణమే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి ‘యాక్సిడెంట్ కేసు’ గా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసిన అనంతబాబును పోలీసులు కాపాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో ఆదివారంనాడు బాలాజీ జంక్షన్ వద్ద టీడీపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. తక్షణమే అనంతబాబును అరెస్ట్ చెయ్యాలంటూ డిమాండ్ చేసింది. అదే విధంగా సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోవాలంటూ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా దళితులపై దాడులను ఖండిస్తూ టీడీపీ ఎస్సి నాయకుల నిరసన ప్రదర్శన నిర్వహించారు.

కాకినాడ జిల్లా లో రెండురోజుల క్రితం వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు తన వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని వెంట తీసుకుని వెళ్ళి హత్యచేసి మళ్ళీ అదే కారులో సుబ్రమణ్యం ఇంటికి తీసుకుని వచ్చి ఆ కుటుంబం వారితో తనకు యాక్సిడెంట్ అయిందని చనిపోయాడు, మృతదేహాన్ని తీసుకొండి అని బెదిరింపులు కు దిగడాన్ని టీడీపీ నిరసించింది.

సదరు సుబ్రహ్మణ్యం భార్యను బెదిరించి ఈ విషయం బయటకు చెప్తే మీ అంతు చూస్తానని ఎమ్మెల్సీ అనంత బాబు బెదిరించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆద్వర్యంలో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలని  డిమాండ్ చేసింది. ఈ క్రమంలో నే సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విజయనగరం  బాలాజీ జంక్షన్ లో  గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేసింది.

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై వాస్తవాలు తెలుసుకునేందుకు తెలుగుదేశం  ఎస్సి సెల్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ వెళ్తే వారి పై దాడులు చేయడాన్ని కూడా ఖండించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ  ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  మామిడి రవిశంకర్, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు  మైలపిల్లి పైడిరాజు,  రాష్ట్ర కార్యదర్శి ఎస్. రామకృష్ణ(శ్రీకాకుళం) , విజయనగరం పార్లమెంటరీ ఉపాద్యక్షులు గండిపిల్లి సింహాచలం,  విజయనగరం పార్లమెంటరీ అధికార ప్రతినిధి దాన రాంబాబు, విజయనగరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి . జి. మోహనరావు, విజయనగరం ఎస్సీ సెల్ అద్యక్షులు కంచుబారికి పైడిరాజు , టౌన్ వైస్ ప్రెసిడెంట్ G. అప్పారావు , ప్రధాన కార్యదర్శి ఎ. రాఘవ , కార్యదర్శి  ఎస్. శంకర్రావు, పట్టణ కార్యవర్గ సభ్యులు ఎస్. శంకర్ ,చింతల నీలకంఠం 27 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు, దేవరపల్లి బుజ్జి, యువజన నాయకులు కంఠ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాం

Satyam NEWS

ఆసుపత్రికి తీసుకెళ్లమంటే కిడ్నీ అమ్మేశాడు

Murali Krishna

ఫ్యామిలీ ఫిజీషియ‌న్ వైద్య విధానం అద్భుతం

Bhavani

Leave a Comment